ఉత్తరాఖండ్‌: కూలిన హెలికాప్టర్‌.. ఐదుగురు మృతి

  • By: sr    news    May 08, 2025 7:56 PM IST
ఉత్తరాఖండ్‌: కూలిన హెలికాప్టర్‌.. ఐదుగురు మృతి

విధాత, న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌ లో హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో ఐదుగురు మృతి దుర్మరణం చెందారు. పర్యాటకులతో వెళ్తున్న ఓ ప్రైవేటు హెలికాప్టర్ కూలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు ఉత్తరకాశీలో గంగోత్రి వైపు వెళ్తున్న ఒక ప్రైవేటు హెలికాప్టర్‌ గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆకస్మికంగా కూలిపోయింది.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో హెలీకాప్టర్‌లో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఐదుగురు మృతి చెందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.