Ebrahim Raisi | హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం
Ebrahim Raisi | హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) మరణించినట్లు ఆ దేశ మీడియా ప్రకటించింది. రైసీ ప్రయాణిస్తున్న చాపర్ ఆదివారం తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్‌లోని అటవీ ప్రాంతంలో కూలిపోయిన విషయం తెలిసిందే. సంఘటన అనంతరం సహాయక చర్యలు చేపట్టిన ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ ఇవాళ ఉదయం.. చాపర్ కూలిపోయిన ప్రాంతాన్ని గుర్తించింది.

Ebrahim Raisi | హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) మరణించినట్లు ఆ దేశ మీడియా ప్రకటించింది. రైసీ ప్రయాణిస్తున్న చాపర్ ఆదివారం తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్‌లోని అటవీ ప్రాంతంలో కూలిపోయిన విషయం తెలిసిందే. సంఘటన అనంతరం సహాయక చర్యలు చేపట్టిన ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ ఇవాళ ఉదయం.. చాపర్ కూలిపోయిన ప్రాంతాన్ని గుర్తించింది. ఈ దుర్ఘటనలో రైసీ ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తాసంస్థ ఐఆర్ఎన్‌ఏ ధ్రువీకరించింది. ఆయనతో పాటు విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీరబ్దొల్లహియన్ (60), తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మలేక్ రహ్‌మతీతో పాటు ఇతర అధికారులు సైతం ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది.
ఇబ్రహీం రైసీ ఆదివారం అజర్‌బైజాన్ సరిహద్దుల్లో కిజ్ కలాసీ, ఖొదావరిన్ రెండు డ్యామ్‌లను ఇరాన్, అజర్‌బైజాన్ సంయుక్తంగా నిర్మించారు. వాటిని అజర్‌బైజార్ అధ్యక్షుడు ఇల్హమ్ అలియేవ్‌తో కలిసి రైసీ వాటిని ప్రారంభించారు. అనంతరం విదేశాంగ మంత్రి హోస్సేన్, తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్ గవర్నర్, తబ్రిజ్ ప్రావిన్స్ ఇమామ్‌లతో కలిసి తబ్రిజ్ పట్టణానికి చాపర్‌లో ప్రయాణం ప్రారంభించారు. జోల్ఫా నగర సమీపానికి చేరుకోగానే రైసీ ప్రయాణిస్తున్న చాపర్ ప్రతికూల వాతావరణ పరిస్థితులతో కూలిపోయింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు వాయువ్యంగా దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. ప్రమాదం అనంతరం ఇరాన్ బలగాలు సంఘటనా స్థలానికి చేరుకునేందుకు ప్రయత్నించారు.
సోమవారం ఉదయం ఘటన జరిగిన కచ్చితమైన ప్రదేశాన్ని ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ గుర్తించింది. ప్రమాదంలో హెలికాప్టర్ ధ్వంసమైంది. అందులో ఎవరూ దుర్ఘటనలో ఎవరూ బతికే అవకాశం లేదని తొలుత ప్రకటించారు. ఆ తర్వాత ఇరాన్ మీడియా అధ్యక్షుడి మరణ వార్తను ధ్రువీకరించింది.క రైసీ 2017లో ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. హసన్ రౌహానీ చేతిలో పరాజయం పాలయ్యారు. 2019లో న్యాయ వ్యవస్థ అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. 2021లో దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీకి వారసుడిగా రైసీని పేర్కొంటారు.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో హెలికాప్టర్ కూలడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖమేనీ, రైసీల ఆదేశాలతో ఇజ్రాయెల్‌పై ఇరాన్ బలగాలు గత నెలలో డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్, అబ్దోల్లాహియాన్‌తోపాటు, తబ్రీజ్ ఇమామ్ అయతుల్లా మొహమ్మద్ అలీ అల్ ఏ హేమ్, ఇరాన్ ప్రావిన్స్ ఆఫ్ ఈస్ట్ అజర్‌బైజాన్ గవర్నర్ మాలెక్ రహ్మతి విమానంలో ఉన్నారని ఐఆర్‌ఎన్‌ఏ స్టేట్ వార్తా సంస్థ తెలిపింది. అధ్యక్షుడి రక్షణ విభాగం కమాండర్ సర్దార్ సయ్యద్ మెహదీ మౌసవీతో పాటు పలువురు అంగరక్షకులు, హెలికాప్టర్ సిబ్బంది సైతం ప్రాణాలు కోల్పోయారు.