చేప ప్రసాదం ముహూర్తం ఫిక్స్.. జూన్ 8, 9 తేదీల్లో…

చేప ప్రసాదం పంపిణీకి సంబంధించిన ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ మేరకు చేప ప్రసాదం పంపిణీకి సంబంధఙంచి సెంట్రల్ జోన్ డీసీసీ శిల్పవల్లి నేతృత్వంలో ఓ సమావేశం నిర్వహించారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేయనున్నారు.
మొత్తం 21 ప్రభుత్వ శాఖల ప్రతినిధులు, నిర్వాహక సంస్థ, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు, ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చేప ప్రసాదం పంపిణీ సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయా శాఖలవారీగా చర్చించారు.
గత యేడాది లోపాలను సమీక్షించి ఈసారి అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వీఐపీలు వచ్చినా సాధారణ జనాలకు ఇబ్బంది కలగకుండా ఈసారి ఎక్కువ సంఖ్యలో చేప ప్రసాదం పంపిణీ స్టాళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక, చేప ప్రసాదం తీసుకోవటానికి వచ్చే వారిని మోసం చేసే ప్రయత్నాలు జరుగుతాయని, వాటిని నిరోధించటానికి నిఘా పెంచాలని డీసీపీ శిల్పవల్లి సిబ్బందిని ఆదేశించారు.
ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలన్నారు.
ఎగ్జిబిషన్ గ్రౌండ్ తోపాటు రైల్వే స్టేషన్లు, బస్టాండుల్లో స్టాల్స్ ఏర్పాటు చేస్తే రద్దీ తగ్గే అవకాశాలు ఉంటాయని కొందరు అభిప్రాయపడ్డారు. ఈ విషయమై బత్తిని కుటుంబ సభ్యులతో మాట్లాడాలన్నారు.