TSRTC Bus Fare Cut | హైదరాబాద్-విజయవాడ రూట్ ఆర్టీసీ చార్జీల తగ్గింపు
హైదరాబాద్-విజయవాడ బస్సుల్లో టికెట్ ధరలు తగ్గించేందుకు టీఎస్‌ఆర్టీసీ సరికొత్త తగ్గింపు ఆఫర్ ప్రకటించింది. గరుడ, సూపర్ లగ్జరీ, లహరి బస్సులకు 16%-30% వరకు డిస్కౌంట్ వర్తింపు.

TSRTC Bus Fare Cut | విధాత : హైదరాబాద్-విజయవాడ రూట్‌లో రాకపోకలు సాగించేవారికి తెలంగాణ ఆర్టీసీ ఊరటనిచ్చే వార్తను అందించింది. ఆ మార్గంలో నడిచే బస్సుల్లో టికెట్ ధరలపై భారీ తగ్గింపును ప్రకటించింది. 16శాతం నుంచి 30శాతం వరకు టికెట్ ధరల్లో ప్రత్యేక ఆఫర్ ఇస్తున్నట్లు తెలుపుతూ ‘ఎక్స్’లో పోస్టు పెట్టింది.
గరుడ ప్లస్ బస్సుల్లో టికెట్ ధరపై 30శాతం, ఈ-గరుడ బస్సుల్లో 26శాతం ప్రత్యేక తగ్గింపు ఆఫర్ ఇవ్వనుంది. అలాగే, సూపర్ లగ్జరీ, లహరి నాన్ ఏసీ బస్సుల్లో 20శాతం, రాజధాని, లహరి ఏసీ బస్సుల్లో టికెట్లపై 16శాతం మేర తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ రాయితీలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బుకింగ్‌లకు వర్తించనున్నాయి. ఈ టికెట్లను తమ అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని కూడా ఆర్టీసీ వెల్లడించింది.