Warangal: ఇదేనా ప్రజాస్వామ్యం.. రేవంత్ రెడ్డి?

- అక్రమ అరెస్టులతో నియంత పాలన కొనసాగించ లేరు
- అరెస్టు చేసిన నాయకులను బేషరత్ గా విడుదల చేయాలి
- IFTU రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు కె,విశ్వనాథ్, ఆరెళ్ళి కృష్ణ డిమాండ్
విధాత: ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హమీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తే అరెస్టులు చేయడం సిగ్గుచేటని ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె విశ్వనాథ్ ఆరెల్లి కృష్ణ విమర్శించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలన మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ పాలన కొనసాగుతుందన్నారు. బిఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతుందని హెచ్చరించారు. శాసనసభ సమావేశాల సందర్భంగా ప్రజా సంఘాల, వామపక్ష పార్టీల నేతలను బోధన్ పోలీసులు అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. గోదావరిఖని తిలక్ నగర్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం జరిగింది.
ఈ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఏడు వాగ్దానాలను అమలు చేయడంలో పూర్తిగా వైపల్యం చెందిందని ప్రభుత్వ పాలన తీరుపై మండిపడ్డారు. ఏడవ వాగ్దానం ప్రజాస్వామ్యని గావు కేకలు పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు ముందస్తు అరెస్టులు దేనికి నిదర్శనం చెప్పాలని వారు ప్రశ్నించారు. ఇచ్చిన వాగ్దానాలు అడుగుతే ఆరెస్టులు చేయటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో నియంత పాలనగా కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి అప్రజాస్వామికి చర్యలను తీవ్రంగా ఖండించాలని ప్రజలు, ప్రజాస్వామికవాదులను కోరారు.అరెస్టు చేసిన IFTU రాష్ట్ర ఉపాధ్యక్షులు వరదయ్య, ఇతర ప్రజా సంఘాల,పార్టీ నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు కందగట్ల సురేందర్, నాయకులు కే భాస్కర్ రెడ్డి,కేతి లింగయ్య,ఆల్ పాస్, వి,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.