హైదరాబాద్‌లో విజయవంతంగా జిగ్లీ వాగథాన్
భారతదేశంలో మొట్టమొదటి సాంకేతిక ఆధారిత ఓమ్నిఛానల్ పెట్ కేర్ బ్రాండ్ జిగ్లీ, జూబ్లీ హిల్స్‌లోని జిగ్లీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో తమ ప్రతిష్టాత్మక వాగథాన్‌ను నిర్వహించింది. అభిరుచి కలిగిన పెంపుడు జంతువుల యజమానులు, వారి ఫర్రి స్నేహితులను ఒకచోట చేర్చే ఉత్తేజకరమైన వాకథాన్‌ను తీసుకురావడం ద్వారా ఫిట్‌నెస్, స్నేహం, పెంపుడు జంతువుల యాజమాన్యం యొక్క ఆనందాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం.

హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విధాత): భారతదేశంలో మొట్టమొదటి సాంకేతిక ఆధారిత ఓమ్నిఛానల్ పెట్ కేర్ బ్రాండ్ జిగ్లీ, జూబ్లీ హిల్స్‌లోని జిగ్లీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో తమ ప్రతిష్టాత్మక వాగథాన్‌ను నిర్వహించింది. అభిరుచి కలిగిన పెంపుడు జంతువుల యజమానులు, వారి ఫర్రి స్నేహితులను ఒకచోట చేర్చే ఉత్తేజకరమైన వాకథాన్‌ను తీసుకురావడం ద్వారా ఫిట్‌నెస్, స్నేహం, పెంపుడు జంతువుల యాజమాన్యం యొక్క ఆనందాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం.
ఈ వాగథాన్ ఉదయం 7:00 గంటలకు రిజిస్ట్రేషన్ , కిట్ పంపిణీతో ప్రారంభమైంది. ఉత్సాహభరితమైన రీతిలో ఒక కిలోమీటర్ నడక ఉదయం 7:30 గంటలకు జిగ్లీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ వద్ద ప్రారంభమై , తిరిగి ప్రారంభ స్థానానికి చేరుకుంది. దాదాపు 80 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వాగథాన్‌ను భారీ విజయంగా మార్చడంలో వారి పాత్రకు గుర్తింపుగా, పాల్గొన్నవారు సర్టిఫికెట్లు, పతకాలు ట్రోఫీలను అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముందు బెంగళూరు వాగాథాన్ కూడా అపూర్వ విజయం సాధించింది , ఇక్కడ ఫ్లాష్ సేల్ కార్యక్రమంకు మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా కాస్మో ఫస్ట్ గ్రూప్ సీఈఓ పంకజ్ పోద్దార్ మాట్లాడుతూ..
“హైదరాబాద్‌లోని పెంపుడు జంతువుల తల్లిదండ్రులందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వారి ప్రేమ , మద్దతు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. జంతు సంక్షేమం యొక్క మహోన్నత లక్ష్యానికి మద్దతు ఇవ్వడం పట్ల మా అచంచలమైన నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది. జిగ్లీ యొక్క వాగథాన్ కార్యక్రమం కేవలం ఒక కార్యక్రమం కంటే ఎక్కువ; ఇది పెంపుడు జంతువులు, పెంపుడు జంతువుల తల్లిదండ్రుల మధ్య విడదీయరాని బంధానికి ఒక ఉత్సాహభరితమైన వేడుక”అని అన్నారు.
పెంపుడు జంతువుల సంరక్షణకు మించి మార్పు తీసుకురావాలనే దాని లక్ష్యానికి అనుగుణంగా, వాగథాన్ కార్యక్రమం ద్వారా దాదాపు రూ. 1 లక్ష సేకరించామని, 110+ మంది ఈ కార్యక్రమానికి తమ తోడ్పాటు అందించారని జిగ్లీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ మొత్తాలను జంతువుల సంక్షేమ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి జిగ్లీ ఫౌండేషన్‌కు అందజేశారు. పెంపుడు జంతువులు మరియు జంతువుల కోసం మరింత కరుణామయమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించాలనే జిగ్లీ నిబద్ధతను పునరుద్ఘాటించారు.