KCR | కేంద్ర ప్ర‌భుత్వం.. ఆపరేషన్‌ కగార్‌ను ఆపేయాలి

  • By: sr    news    Apr 27, 2025 10:48 PM IST
KCR | కేంద్ర ప్ర‌భుత్వం.. ఆపరేషన్‌ కగార్‌ను ఆపేయాలి

KCR |

బీజేపీ విమర్శలను సంధించిన కేసీఆర్‌.. పదకొండేళ్లలో తెలంగాణకు 11రూపాయలైనా ఇచ్చారా? అని నిలదీశారు. ‘వ‌ట్టిదే బొబ్బ‌.. భభ్రాజ‌మానం భ‌జ‌గోవిందం.. శుష్క‌ప్రియాలు శూన్య‌హ‌స్తాలు త‌ప్ప‌.. ఏం ఇవ్వ‌లేదు. ప్ర‌త్యేక రాష్ట్రం వ‌చ్చింద‌ని తెలంగాణోళ్లు సంతోష‌ప‌డితే.. త‌ల్లిని చంపి బిడ్డ‌ను బ‌తికించిండ్రు అని న‌రేంద్ర మోదీ మాట్లాడుత‌డు’ అని కేసీఆర్ మండిప‌డ్డారు. కేంద్ర ప్ర‌భుత్వం క‌గార్ అనే ఆప‌రేష‌న్ పేరు మీద ఛ‌త్తీస్‌గ‌ఢ్ యువ‌కుల‌ను, గిరిజ‌నులను ఊచ‌కోత కోస్తున్నారని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి చ‌ర్చ‌లు చేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని న‌క్స‌లైట్లు ప్ర‌తిపాద‌న పెడుతున్న‌రు. ఈ సంద‌ర్భంగా నేను కోరుతున్నా.. కేంద్ర ప్ర‌భుత్వాన్ని. బ‌లమున్న‌ది అని సంపుకుంట పోవుడు కాదు.. అది ప్ర‌జాస్వామ్యం కాదు.. ఆప‌రేష‌న్ క‌గార్‌ను వెంట‌నే ఆపేయండి. న‌క్స‌లైట్ల‌ను పిలిచి డెమోక్రాటిక్ స్పేస్ ఇచ్చి చ‌ర్చ‌లు జ‌ర‌పండి. అట్ల కాదు ఏరిపారేస్తాం.. న‌రికిపారేస్తాం అంటే.. మిల‌ట‌రీ మీ ద‌గ్గ‌రున్న‌ది కొడుత‌రు. కానీ ప్ర‌జ‌స్వామ్యం అనిపించుకోదు’ అన్నారు.