Kavitha | కేసీఆర్‌ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు: ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

  • By: TAAZ    news    May 23, 2025 9:21 PM IST
Kavitha | కేసీఆర్‌ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు: ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

– బీఆర్ఎస్ పార్టీలో కోవ‌ర్టులు
– రెండు వారాల క్రిత‌మే లేఖ రాశాను
– ఈ లేఖ ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చిందో తెలియ‌దు
– కార్య‌క‌ర్త‌ల అభిప్రాయాలే ప్ర‌స్తావించాను
– బీఆర్ఎస్ కొన్ని లో్పాల‌ను స‌వ‌రించుకోవాలి
– బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత

విధాత‌, హైద‌రాబాద్ః కేసీఆర్ దేవుడులాంటి వాడ‌ని.. ఆయ‌న చుట్టూ ద‌య్యాలు ఉన్నాయ‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత వ్యాఖ్యానించారు. మీడియాలో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న లేఖ‌పై క్లారిటీ ఇచ్చారు. తాను లేఖ రాసింది నిజ‌మేన‌ని పేర్కొన్నారు. రెండు వారాల క్రిత‌మే లేఖ రాశాన‌ని పేర్కొన్నారు. అయితే ఆ లేఖ ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చిందో త‌న‌కు తెలియ‌ద‌న్నారు. లేఖ బ‌య‌ట‌కు రావ‌డం వెనుక ఏదో కుట్ర ఉంద‌ని వ్యాఖ్యానించారు. కార్య‌క‌ర్త‌ల అభిప్రాయాలే తాను లేఖ‌లో ప్ర‌స్తావించాన‌ని చెప్పారు. కేసీఆరే త‌మ నాయ‌కుడని అందులో ఎటువంటి డౌట్ లేద‌ని చెప్పారు. అమెరికా నుంచి వ‌చ్చిన క‌విత శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్ర‌యం వ‌ద్ద మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ చుట్టూ ఉన్న కోవ‌ర్టుల వ‌ల్ల పార్టీకి నష్టం జరుగుతున్నదంటూ ఆరోపించారు. తాను రాసిన లేఖ బయటికి వచ్చిందంటే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిట‌ని పేర్కొన్నారు. ఆ లేఖ త‌న‌దేన‌ని అందులో పర్సనల్ అజెండా ఏమీ లేద‌ని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నాయకత్వంలోనే బీఆర్ఎస్ ముందుకు వెళ్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. పార్టీలో ఉన్న చిన్న లోపాల‌ను సవరించుకొని ముందుకు సాగాల‌ని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణ‌కు ఒర‌గ‌బెట్టింది ఏమీ లేద‌ని పేర్కొన్నారు.

ఆ రెండు పార్టీల వ‌ల్ల తెలంగాణ‌కు అన్యాయం జ‌రిగింద‌ని చెప్పారు. ఆ రెండు పార్టీల‌కే కేసీఆరే ప్ర‌త్యామ్నాయ‌మ‌ని పేర్కొన్నారు. మ‌రోవైపు క‌వితకు స్వాగ‌తం ప‌లికేందుకు ఆమె అనుచ‌రులు విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. ఎక్క‌డా బీఆర్ఎస్ జెండాలు క‌నిపించ‌కుండా క‌విత టీం అన్న పేరుతో వాళ్లు ఫ్లెక్సీలు ప్ర‌ద‌ర్శించారు. క‌విత సీఎం అంటూ పెద్ద ఎత్తున కార్య‌క‌ర్త‌లు నినాదాలు చేయ‌డం గ‌మ‌నార్హం.