Tuk Tuk: ఓటీటీలో.. టుక్ టుక్ సంచలనం! భారీ బడ్జెట్ చిత్రాలను మించి రికార్డ్ వ్యూస్

రెండు నెలల క్రితం థియేటర్‌లోకి నెల క్రితం ఓటీటీలోకి వచ్చి ప్రేక్షకుల నుంచి విశేషాధరణ దక్కించుకుంటున్న చిత్రం టుక్ టుక్ (Tuk Tuk). హర్ష రోషన్ (Harsh Roshan), సలార్ ఫేం కార్తికేయ దేవ్ (Karthikeyaa Dev), స్టీవెన్ మధు, సాన్వీ మేఘన (Saanve Megghana), నిహాల్ కోధాటి ముఖ్య పాత్రల్లో రూపొందిన ఈ చిత్రాన్ని చిత్రవాహిని మరియు ఆర్ వై జి సినిమాస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో సి.సుప్రీత్ కృష్ణ (Supreeth C Krishna) రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డిలతో కలిసి నిర్మించారు.
అయితే ఎలాంటి భారీ తారాగణం, బడ్జెట్ లేకుండానే కేవలం ముగ్గురు కుర్రాళ్లను కేంద్రంగా చేసుకుని తెరకెక్కించిన ఈ చిత్రం ఊహించని విధంగా ప్రేక్షకాధరణను దక్కించుకుని ఔరా అనిపిస్తోంది. కేవలం పెద్ద చిత్రాలకు మాత్రమే సాధ్యమయ్యే మిలియన్ల వ్యూస్‌ను అతి తక్కువ సమయంలో ఈ టుక్ టుక్ సినిమా సాధించి పెద్ద సినిమాలకు షాక్ ఇచ్చింది. తాజాగా ఈ చిత్రం 100 మిలియన్ల వ్యూస్‌ను సైతం అధిగమించి అప్రతిహాతంగా దూసుకుపోతుంది. ప్రసత్ఉతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
ముగ్గురు కుర్రాళ్ళు డబ్బులు సంపాదించాలని వినాయక చవితి పండుగ చేస్తారు. అయితే ఆ ఊర్లో వారితో అప్పటికే ఉన్న గొడవల కారణంగా వారి వినాయక నిమజ్జనానికి బండి దొరకదు. దీంతో ఆ ముగ్గురు స్నేహితులు ఓ షెడ్డులో మూలకు పడి ఉన్న ఓ చేతక్ స్కూటర్‌ను బయటకు తీసి మరమ్మతులు చేసి వారి కార్యం పూర్తి చేసుకుంటారు. కానీ అప్పటి నుంచే కథ మలుపులు తిరుగుతుంది.
సడన్‌గా ఆ స్కూటర్ ఈ కుర్రాళ్ల మాటలకు రెస్పాండ్ అవుతూ హ్యాండిల్ ఊపుతూ వారి మాటలకు జవాబిస్తుంటుంది. అదే కోవలో ఆ బండిని ఉపయోగించి కొంత డబ్బు సైతం సంపాదిస్తారు. కానీ ఓ ఇటి దగ్గరకు రాగానే సైలెంట్ అవుతుంది.ఇంతకు ఆ స్కూటర్ అలా ఎందకు చేసింది, శిల్ప అనే అమ్మాయికి ఆ స్కూటర్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనే సక్తికర కథకథనాలతో సినిమా సాగుతుంది.