Thippiri Tirupathi : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి
మావోయిస్టు పార్టీ (Maoist Party) కేంద్ర కమిటీ కొత్త కార్యదర్శిగా కరీంనగర్‌కు చెందిన తిప్పిరి తిరుపతి నియామకం, కీలక బాధ్యతలు చేపట్టారు. గతంలో సీపీఐ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శిగా ఉన్న నంబాల కేశవరావు ఎన్ కౌంటర్ అనంతరం కొత్త నేతను ఆ పార్టీ ఎన్నుకున్నది.

Thippiri Tirupathi : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కొత్త కార్యదర్శిగా కరీంనగర్ జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి నియామితులయ్యారు. నంబాల కేశవరావు ఎన్ కౌంటర్ తో ఖాళీయైన పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి పదవికి మరో తెలుగువాడైన తిప్పిరి తిరుపతి నియామితులు కావడం విశేషం. ప్రస్తుతం పార్టీ సెంట్రల్ కమిషన్ చీఫ్ గా ఉన్న తిరుపతి గ్రీన్ హంట్ సమయంలో బెంగాల్లో లాల్ గఢ్ ఉద్యమానికి నాయకత్వం వహించారు. మావోయిస్టు పార్టీలో సెకండ్ క్యాడర్ లో ఉన్న తిరుపతి అలియాస్ దేవ్ జీ పార్టీ దాడులకు వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. పార్టీలో కేజీ సత్యమూర్తి, కొండపల్లి సీతారామయ్య, గణపతి, నంబాల తర్వాత మరోసారి తెలుగు వాడైన తిరుపతికి కీలకమైన మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి బాధ్యతలు దక్కడం గమనార్హం. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో మరో తెలుగువాసి తిరుపతి తో పాటు మల్లోజుల వేణుగోపాలరావు పార్టీ పొలిటికల్ బ్యూరో చీఫ్‌గా పనిచేస్తున్నట్లుగా సమాచారం.
తిరుపతి ఉద్యమ ప్రస్థానం..
కరీంనగర్ జిల్లా కోరుట్లలోని అంబేద్కర్ నగర్ కు చెందిన తిరుపతి 1983లో డిగ్రీ చదువుతున్న క్రమంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ సభ్యుడిగా పనిచేశారు. పోలీసు కేసుల నేపథ్యంలో 1983లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. దళ సభ్యుడి నుంచి పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా, మిలిషియా డాడుల వ్యూహకర్తగా పార్టీలో రెండో పొషిషన్ కు ఎదిగాడు. తిరుపతిపై రూ. 1కోటి రూపాయల రివార్డు ఉంది.
మిలిషియ మెరుపు దాడులు జరిపి తప్పించుకోవడంలో దిట్టగా తిరుపతికి పేరుంది. చంద్రబాబుపై అలిపిరి దాడిలో నంబాల కేశవరావుతో పాటు తిరుపతి కూడా ఉన్నాడని అప్పట్లో ప్రచారం జరిగింది. 201లో దంతెవాడలో 74మంది సీఆర్ఎఫ్ జవాన్లను చంపిన దాడికి తిరుపతి సారధ్యం వహించాడని పోలీసు వర్గాల కథనం. ఆపరేషన కగార్ నేపథ్యంలో తిరుపతి ప్రస్తుతం బెంగాల్ సరిహద్దుల్లో షెల్టర్ తీసుకున్నాడని ఇంటలిజెన్స్ భావిస్తుంది.