Kaleshwaram Lift Irrigation: ఆ 57 మంది.. ఇంజినీర్లపై క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌!

Kaleshwaram Lift Irrigation: ఆ 57 మంది.. ఇంజినీర్లపై క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌!
  • నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ పైనా..
  • మేడిగడ్డ కుంగుబాటుకు బాధ్యులు
  • చర్యలు తీసుకోవాలన్న విజిలెన్స్‌
  • రహస్య లేఖ లేటుగా బయటకు!
  • మరమ్మతులపై ఇంజినీర్ల లేఖను
  • పట్టించుకోని నిర్మాణ సంస్థ
  • ఎల్‌అండ్‌టీపైనా చర్యలు తీసుకోవాలి
  • మరమ్మతుల ఖర్చును రాబట్టాలి
  • కాన్ఫిడెన్షియల్‌ లెటర్‌లో కీలక అంశాలు
  • కాళేశ్వరం విచారణ నేపథ్యంలో
  • రాష్ట్ర అధికారవర్గాల్లో కలకలం

Kaleshwaram Lift Irrigation: హైద‌రాబాద్‌, జూన్ 2 (విధాత‌): కాళేశ్వ‌రం లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టు (కేఎల్ఐపీ)లో భాగమైన మేడిగ‌డ్డ బారాజ్ కుంగిన ఘ‌ట‌న‌లో పెద్ద సంఖ్యలో ఇంజినీరింగ్‌ అధికారులపై క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌, జరిమానాల విధింపునకు సిపారసు చేస్తూ విజిలెన్స్‌ కమిషన్‌ రాసిన పూర్తి లేఖ ఆలస్యంగా వెలుగు చూసింది. మేడిగడ్డ బరాజ్‌ కుంగుబాటుకు వీరితోపాటు నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ కూడా కారణమని పేర్కొంటూ, దానిపైనా కఠిన చర్యలకు విజిలెన్స్‌ కమిషన్‌ సిఫారసు చేసింది. బాధ్యులైన ఇంజినీర్ల‌పై ఏమేమి చ‌ర్య‌లు తీసుకోవాలో సూచిస్తూ తెలంగాణ నీటి పారుద‌ల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శికి ఈ ఏడాది మార్చి 18వ తేదీన విజిలెన్స్ క‌మిష‌న్ లేఖ రాసింది. స్ట్రిక్ట్ లీ కాన్షిడెన్షియ‌ల్ పేరుతో పంపించిన ఈ లేఖ ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. లేఖ‌లో విజిలెన్స్ క‌మిష‌న్ సిఫార‌సు చేసిన అంశాలు ఇలా ఉన్నాయి.

విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ (వీ అండ్ ఈ డీజీ) పంపించిన వివ‌రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న‌ట్లు తెలంగాణ విజిలెన్స్ క‌మిష‌న్ పేర్కొంది. మేడిగ‌డ్డ బారాజ్‌తోపాటు.. అన్నారం, సుందిళ్ల సీపేజీ పై విచార‌ణ జ‌రిపిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ (వీ అండ్ ఈ డీజీ) మార్చి మొద‌టి వారంలో ప్ర‌భుత్వానికి, నీటి పారుద‌ల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శికి ప‌లు సిఫార‌సుల‌తో నివేదిక అంద‌చేశారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నాణ్య‌త‌, డిజైన్‌, ఆప‌రేష‌న్ అండ్ మెయింటెనెన్స్ త‌దిత‌ర అంశాల‌పై లోతుగా విచార‌ణ నిర్వ‌హించి, నిజ నిర్ధారణ చేసి, వాటిలో సదరు ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ విఫ‌ల‌మైన‌ట్లు వెల్ల‌డించింది. మేడిగడ్డ బారాజ్ నిర్వ‌హ‌ణ‌, మ‌ర‌మ‌త్తుల విషయంలో ఇంజినీర్లు లేఖ రాసినా.. కాంట్రాక్టు పొందిన ఏజెన్సీ ఎల్ అండ్ టీ పీఈఎస్‌ (జాయింట్ వెంచ‌ర్‌) చ‌ర్య‌లు తీసుకోలేద‌ని స్ప‌ష్టం చేసింది. ఇందులో భాగ‌స్వామ్య‌మైన ఇంజినీరింగ్ అధికారులపై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయాల‌ని సిఫార‌సు చేసింది. కాంట్రాక్టు ద‌క్కించుకున్న ఏజెన్సీ ఎల్ అండ్ టీ పీఈఎస్‌ (జాయింట్ వెంచ‌ర్‌) పై కూడా చ‌ర్య‌ల‌ను సూచించింది. వీ అండ్ ఈ డీజీ నివేదిక‌ను త‌దుప‌రి చ‌ర్య‌ల కోసం నీటి పారుద‌ల శాఖ, తెలంగాణ‌ విజిలెన్స్ క‌మిష‌న్ కు పంపించింది.

ఈ నివేదిక‌ను అధ్య‌య‌నం చేసిన విజిలెన్స్ క‌మిష‌న్ బాధ్యులైన ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ ఎల్ అండ్ టీ పీఈఎస్‌ (జాయింట్ వెంచ‌ర్‌) పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి సిఫార‌సు చేసింది. కొందరిపై క్రిమినల్‌ కేసులతో పాటు జరిమానాలు కూడా విధించాలని ప్రతిపాదించింది. ప్ర‌భుత్వ నిధుల వ్య‌యంలో దుర్వినియోగానికి పాల్ప‌డిన వీరిపై ఐపీసీలోని సెక్ష‌న్ 120 (బీ), 336, 409, 418, 423, 426 ప్ర‌కారం, డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం వెంట‌నే కేసులు పెట్టాల‌ని పేర్కొంది. అదే విధంగా 33 మంది ఇంజినీర్ల బాధ్య‌తారాహిత్యంపై భారీగా అప‌రాధ రుసుం విధించాల‌ని స్ప‌ష్టం చేసింది.

వీరే కాకుండా ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన ఏడుగురు ఇంజినీర్ల ఆర్టిక‌ల్స్ ఆఫ్ చార్జెస్ (అభియోగాలు) న‌మోదు చేసి, జరిమానాలు విధించి, క‌మిష‌న‌ర్ ఆఫ్ ఎంక్వ‌రీస్ కు అప్ప‌గించాల‌ని విజిలెన్స్ క‌మిష‌న్ సిఫార‌సు చేసింది. పోలీసు విచార‌ణ, క్రిమిన‌ల్ కేసులు పెండింగ్ లో ఉండ‌గానే శాఖాప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చ‌ని, దీనికి ఎలాంటి న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు లేవ‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింద‌ని ఆ సిఫార‌సులో పేర్కొంది. నీటి పారుద‌ల శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ తీసుకోవాల్సిన చ‌ర్య‌లను స‌వివ‌రంగా సూచించింది. మేడిగ‌డ్డ బారాజ్ లో బ్లాక్ 7 నిర్మాణంలో ఎల్ అండ్ టీ పీఈఎస్‌ (జాయింట్ వెంచ‌ర్‌) నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శిండంతో బ్లాక్ సింక్ అయింది. ఏడో బ్లాక్ మరమ్మతులకు అయిన వ్య‌యాన్ని కాంట్రాక్ట్ ఏజెన్సీ నుంచి రిక‌వ‌రీ చేయాలని, ప్ర‌తిపాదిత అంచ‌నా వ్య‌యం, అగ్రిమెంట్ల ప్ర‌కారం నీటిని కాంట్రాక్ట్ ఏజెన్సీయే చెల్లించాని స్పష్టం చేసింది.

బారాజ్ ప‌నులు పూర్తి కాక‌పోయినా, పూర్త‌యిన‌ట్లు నీటి పారుద‌ల శాఖ నుంచి బిల్లులు తీసుకోవ‌డం ఎల్ అండ్ టీ ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డింది. మేడిగ‌డ్డ బారాజ్ లో ఏడో నెంబ‌ర్ బ్లాక్ కుంగుబాటు జ‌రిగినందున మ‌ర‌మ్మ‌త్తు వ్య‌యాన్ని కాంట్రాక్ట్ ఏజెన్సీ నుంచి రిక‌వ‌రీ చేయాలి. మేడిగ‌డ్డ బారాజ్ కుంగుబాటు, నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శించిన 17 మంది ఇంజ‌నీరింగ్ అధికారుల‌పై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోవాలని, 33 మంది ఇంజ‌నీరింగ్ అధికారుల‌పై ఫెనాల్టీలు వేయాల‌ని, ఏడుగురు రిటైర్డు ఇంజ‌నీర్ల‌పై పెన్ష‌న్ రిక‌వ‌రీ చేయాల‌ని పేర్కొంది. వీరితో పాటు ఎల్ అండ్ టి పీఈఎస్ (జాయింట్ వెంచ‌ర్‌) క్రిమిన‌ల్ కేసులు పెట్టాలి. విజిలెన్స్ నివేదిక‌లో ప‌లువురు ఈఎన్సీలు, సీఈలు, ఎస్ఈల పేర్ల‌తో పాటు మాజీ అధికారులు ఉన్నారు.

వీరిపై క్రిమినల్‌ చర్యలకు సిఫారసు..

1. చీటి మురళీధర్, ఇంజినీర్-ఇన్-చీఫ్ (జనరల్) (రిటైర్డ్), జ‌ల‌సౌధ‌, హైద‌రాబాద్‌
2. భూపతిరాజు నాగేంద్ర రావు, ఇంజినీర్-ఇన్-చీఫ్ (ఆపరేషన్స్ & మెయింటెనెన్స్), జలసౌధ, హైదరాబాద్
3. తోడుపునూరి శ్రీనివాస్, చీఫ్ ఇంజినీర్, ఇరిగేషన్, ఆదిలాబాద్
4. వీ ఫణిభూషణ్ శర్మ, డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్, హైదరాబాద్
5. మొహమ్మద్ అజ్మల్ ఖాన్, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్, ఇంజినీర్-ఇన్-చీఫ్ (జనరల్) జ‌ల‌సౌధ‌, హైద‌రాబాద్‌,
6. ఎన్‌.వెంకటేశ్వర్లు, ఇంజినీర్-ఇన్-చీఫ్ (రిటైర్డ్), కాళేశ్వరం ప్రాజెక్ట్
7. కొట్టే సుధాకర్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్ (ఇరిగేషన్), జగిత్యాల & రామగుండం
8. బి.వెంకట రమణా రెడ్డి, గతంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డివిజన్-1, మహదేవ్‌పూర్, & సూపరింటెండింగ్ ఇంజినీర్, రామగుండం,
9. సర్దార్ ఓంకార్ సింగ్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, నీటిపారుదల డివిజన్ నెంబ‌ర్ 3, రామగుండం,
10. సీహెచ్‌. తిరుపతిరావు, డివిజన్ నెం.1, మహదేవ్‌పూర్ డీఈఈ
11. బి.వెంకటేశ్వరి, చీఫ్ ఇంజినీర్, క్వాలిటీ కంట్రోల్ & ఇన్‌స్పెక్షన్ (రిటైర్డ్),
12. వి.అజయ కుమార్, చీఫ్ ఇంజినీర్ (రిటైర్డ్), సంగారెడ్డి,
13. పి.ఎ.వెంకట కృష్ణ, చీఫ్ ఇంజినీర్, క్వాలిటీ కంట్రోల్, ఐ & క్యాడ్‌,
14. ఎం. రఘురామ్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, క్వాలిటీ కంట్రోల్‌ డివిజన్ నెం.9, రామగుండం,
15. ఎ. నరేందర్ రెడ్డి, ఇంజినీర్-ఇన్-చీఫ్ (రిటైర్డ్), సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్,
16. కె.ఎస్.ఎస్. చంద్ర శేఖర్, సూపరింటెండింగ్ ఇంజినీర్, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్,
17. హెచ్. బస్వరాజ్, ఎస్ఈ, ఇరిగేషన్ సర్కిల్, సిద్దిపేట.

వీరిపై జ‌రిమానాలు విధించాలి..

1. భూపతిరాజు నాగేంద్రరావు, ఇంజినీర్-ఇన్-చీఫ్ (ఆపరేషన్స్ & మెయింటెనెన్స్), జలసౌధ, ఎర్రమంజిల్, హైదరాబాద్.
2. తోడుపునూరి శ్రీనివాస్, చీఫ్ ఇంజినీర్, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్,
3. వి.ఫణిభూషణ్ శర్మ, డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్, హైదరాబాద్
4. మొహమ్మద్ అజ్మల్ ఖాన్, ఇంజినీర్-ఇన్-చీఫ్ (జనరల్), హైద‌రాబాద్‌,
5. కొట్టే సుధాకర్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్ (ఇరిగేషన్), జగిత్యాల & రామగుండం,
6. సూదగోని సత్యనారాయణ, డిప్యూటీ ఎస్ఈ, కాళేశ్వరం ప్రాజెక్ట్, రామగుండం,
7. బి.వెంకట రమణ రెడ్డి, చీఫ్ ఇంజినీర్, మహబూబ్ నగర్,
8. సర్దార్ ఓంకార్ సింగ్, ఈఈ, ఇరిగేషన్ డివిజన్ నెంబ‌ర్ 3, రామగుండం,
9. సీహెచ్‌. తిరుపతి రావు, ఈఈ, ఇరిగేషన్ డివిజన్ నెంబ‌ర్ 1, మహాదేవ్‌పూర్,
10. బానోతు నందా, డీఈఈ, సబ్ డివిజన్ నెంబ‌ర్ 2, 3, ఎల్‌ఎమ్‌డి, కరీంనగర్,
11. అజ్మీరా సురేష్ కుమార్, డీఈఈ, సబ్-డివిజన్ నెంంబ‌ర్ 5, అంబట్‌పల్లి
12. ఎల్. భీమ రాజు, డీఈఈ, సబ్-డివిజన్ నెంబ‌ర్ 4, అంబట్పల్లి,
13. వలి షేక్, ఏఈఈ, సబ్-డివిజన్ నెంబ‌ర్ 5, అంబట్‌పల్లి,
14. బోగే శ్రీనివాస్, ఏఈఈ, సబ్-డివిజన్ నెంబ‌ర్ 5, అంబట్‌పల్లి
15. అంకిలియా రవికాంత్, ఏఈఈ, సబ్-డివిజన్ నెంబ‌ర్ 4, అంబట్‌పల్లి
16. ఆర్. విజయ్, ఏఈఈ, సబ్-డివిజన్, కాళేశ్వరం,
17. జి. గంగాధర్, అసిస్టెంట్ ఇంజినీర్‌, సబ్-డివిజన్, అంబట్ పల్లి,
18. జి. సాయిచరణ్, ఏఈఈ, సబ్-డివిజన్-2 మేడిగడ్డ బ్యారేజ్,
19. ఎం. ప్రసాద్, ఏఈఈ, సబ్-డివిజన్ నెం.4, అంబట్ పల్లి,
20. మేరుగు రాజు, డీఈఈ, ఇరిగేషన్ డివిజన్ నెంబ‌ర్ 6, ఇరిగేషన్ సర్కిల్, వేములవాడ, జగిత్యాల,
21. బి. గణేష్, ఏఈఈ, సబ్-డివిజన్ నెంబ‌ర్ 5, అంబట్ పల్లి, ఇరిగేషన్ డివిజన్ నెం.1, మహాదేవ్ పూర్
22. ఎం. ఇస్మాయిల్ సాజిద్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, ఇరిగేషన్ డివిజన్ నెం.5, పెద్దపల్లి,
23. పి.ఎ.వెంకట కృష్ణ, చీఫ్ ఇంజినీర్, క్వాలిటీ కంట్రోల్, జ‌ల‌సౌధ‌,
24. కె. దేవేందర్ రెడ్డి, ఎస్ఈ, క్వాలిటీ కంట్రోల్ సర్కిల్, వరంగల్,
25. ఎం. రఘు రామ్, ఏఈ, డివిజన్ నెంబ‌ర్ 9, రామగుండం,
26. బి. కిరణ్ కుమార్, డీఈఈ, క్వాలిటీ కంట్రోల్ & ఇన్‌స్పెక్షన్, రామగుండం,
27. ఎ. కృష్ణ మోహన్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఈఎన్సీ (అడ్మిన్), జలసౌధ, హైదరాబాద్,
28. జి. కృష్ణ రెడ్డి, ఏఈఈ, క్వాలిటీ కంట్రోల్‌, సబ్-డివిజన్ నంబ‌ర్ 3, కాటారం,
29. ఈ. సుకుమార్, ఏఈఈ, క్వాలిటీ కంట్రోల్ సబ్-డివిజన్ నంబ‌ర్ 1, మహాదేవ్ పూర్‌,
30. పి.శ్రావణ్ కుమార్, ఏఈఈ, క్వాలిటీ కంట్రోసబ్-డివిజన్ నెంబ‌ర్ 1, మహాదేవ్ పూర్,
31. కె.ఎస్.ఎస్.చంద్ర శేఖర్, ఎస్ఈ, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్, జ‌ల‌సౌధ‌, హైద‌రాబాద్‌,
32. హెచ్.బస్వరాజ్, ఎస్ఈ, ఇరిగేషన్ సర్కిల్, సిద్దిపేట,
33. తౌటం హేమలత, డీఈఈ, సెంట్ర‌ల్ డిజైన్స్ , జ‌ల‌సౌధ‌, హైద‌రాబాద్‌,

ఏడుగురు రిటైర్డ్‌ అధికారులపై జరిమానాలు

1. చీటీ మురళీధర్, ఇంజినీర్-ఇన్-చీఫ్ (జనరల్), జ‌ల‌సౌధ‌, హైద‌రాబాద్‌,
2. న‌ల్ల వెంకటేశ్వర్లు, ఇంజినీర్-ఇన్-చీఫ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ ,
3. గజ్జెల హరి హర చారి, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్, కాళేశ్వరం ప్రాజెక్ట్,
4. బి.వెంకటేశ్వర్లు, చీఫ్ ఇంజినీర్, క్వాలిటీ కంట్రోల్, జ‌ల‌సౌధ‌, హైద‌రాబాద్‌,
5. చాట్ల గంగాధర్, ఎస్ఈ, లేక్స్ అండ్ వాటర్ బాడీస్ మేనేజ్‌మెంట్‌ సర్కిల్, హైదరాబాద్,
6. వి.అజయ కుమార్, చీఫ్ ఇంజినీర్, ఇరిగేషన్, సంగారెడ్డి,
7. ఎ.నరేందర్ రెడ్డి, ఇంజినీర్-ఇన్-చీఫ్, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్, జ‌ల‌సౌధ‌, హైద‌రాబాద్‌.