బస్సు ప్రమాదంపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

హైదరాబాద్- బీజాపూర్ నేషనల్ హైవే 163 మీర్జాగూడ వద్ద ఈ రోజు తెల్లవారుజామున జరిగిన కంకర టిప్పర్-బస్సు ప్రమాదం అందరిని కలిచివేసింది. ఈ ప్రమాదంపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు

  • By: Subbu |    news |    Published on : Nov 03, 2025 1:55 PM IST
బస్సు ప్రమాదంపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

హైదరాబాద్, నవంబర్ 03 (విధాత): హైదరాబాద్- బీజాపూర్ నేషనల్ హైవే 163 మీర్జాగూడ వద్ద ఈ రోజు తెల్లవారుజామున జరిగిన కంకర టిప్పర్-బస్సు ప్రమాదం అందరిని కలిచివేసింది. ఈ ప్రమాదంపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రోడ్డు మార్గంలో ఉన్న మర్రి చెట్ల కోసం మనుషుల ప్రాణాలు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోడ్డు నిజాం కాలం నాటిదని, దీనిపై టంగాలు, పాత కార్లు తిరిగేందుకు నిర్మించారన్నారు. ఈ మార్గం పూర్తిగా వంకర్లు తిరిగి ఉంటుందని తెలిపారు.

ఇంతకాలంగా దీన్నే విస్తరిస్తూ వస్తున్నారని, వికారాబాద్ ప్రజలు హైదరాబాద్‌కు వెళ్లేందుకు ఇదొక్కటే హైవే మార్గమని చెప్పారు. తాను ఎంపీ గా ఉన్న సమయంలో దీన్ని విస్తరించాలని చేసిన ప్రయత్నంలో కేంద్ర మంత్రి దీన్ని మంజూరు చేశారన్నారు. కానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం భూ సేకరణ విషయంలో చాలా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.

రోడ్డు విస్తరణ చేస్తే వందాలి ఏండ్లుగా ఉన్నా మర్రి చెట్లు పోతున్నాయని తమిళనాడుకు చెందని పర్యావరణ ప్రేమికులు కోర్టులో కేసులు వేశారని మండిపడ్డారు. కోర్టుకు వెళ్లినవారు ఎవరూ స్థానికులు కాదని, వీరికి మర్రి చెట్లమీద ఫికర్ ఉంది కానీ ప్రజల ప్రాణాల మీద మాత్రం లేదని విమర్శించారు. మర్రి చెట్లను రీప్లాంట్ చేస్తామని చెప్పినా వినలేదని, చివరకు తాజాగా కేసు విత్ డ్రా చేసుకోవడంతో పనులు ప్రారంభమయ్యాయన్నారు.