PadmaBhushanNBK | తెలుగోడి.. పంచకట్టులో పద్మ అవార్డు అందుకున్న బాలకృష్ణ!

విధాత: పద్మ అవార్డుల కార్యక్రమం సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో అట్టహాసంగా సాగింది. పద్మభూషణ్ అవార్డు అందుకోవడానికి తెలుగు చలన చిత్ర పరిశ్రమ సీనియర్ హీరో, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పంచెకట్టులో హాజరయ్యారు. కుటుంబంతో కలిసి నందమూరి బాలకృష్ణ పద్మ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో సందడి చేశారు.
రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా బాలకృష్ణ పద్మ భూషణ్ స్వీకరించారు. తెలుగు దనం ఉట్టిపడేలా బాలకృష్ణ పంచెకట్టులో మెడలో కండువాతో పద్మభూషణ్ అవార్డు స్వీకరించడం తెలుగు వారందరి అభినందనలు అందుకుంది. తెలంగాణ నుంచి ప్రముఖ వైద్యులు దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి పద్మ విభూషణ్ అందుకున్నారు. హీరో అజిత్ కూడా పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు.