Spy Pigeon | అది గూఢచారి పావురమేనా..?

నిజామాబాద్ జిల్లా భవానిపేటలో రెక్కలపై కోడ్ లెటర్స్ ఉన్న అనుమానాస్పద పావురం దొరకడంతో గ్రామస్తులు కలకలం రేపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Spy Pigeon | అది గూఢచారి పావురమేనా..?

Spy Pigeon | విధాత: ఓ అనుమానస్పద పావురం సంచారం కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని భవానిపేట గ్రామంలో ఓ మైనర్ బాలుడికి దొరికిన పావురం రెక్కలపై కోడ్ లెటర్స్ ఉన్నాయి. దీంతో అది గూఢచారి పావురం అన్న అనుమానాలతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఆ పావురాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ఆ పావురం కాలికి కోడ్ రింగ్ ఉండటం..అది శిక్షణ పొందిన పావురంగా కనిపిస్తుండటంతో పావురం ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అంటూ ప్రచారంపోలీసుల అదుపులో పావురం. గతంలోనూ స్పై కెమెరాలు, మైక్రోచీఫ్ అమర్చిన గూఢచారి పావురాలు దేశంలోని పలు రాష్ట్రాలలో పట్టుబడ్డాయి. ఈ నేపథ్యంలో పావురం వ్యవహారంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.