సోనూసూద్ కు మరోసారి నోటీసులు

విధాత: కరోనా వారియర్, సినీ నటుడు సోనూసూద్ కు మరోసారి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరే షన్ నోటీసులు పంపించింది. ఆరు అంతస్తుల బిల్డింగ్ లో సోనూసూద్ హోటల్ ను నడుపుతున్నా రని.. దానిని బిల్డింగ్ ప్లాన్ ప్రకారం నివాస భవంతిగా మార్చుతానన్న మాటను ఇంకా నిలబెట్టుకోలే దని నోటీసులో గుర్తు చేసింది.ఈమేరకు నవంబర్ 15, 2021న ఈ నోటీసులు పంపింది.వెంటనే స్పందించి యథాస్థితిలో బిల్డింగ్ ను కొనసాగించాలని నోటీసులో సూచించింది BMC. మహారాష్ట్రకు చెందిన హక్కుల […]

సోనూసూద్ కు మరోసారి నోటీసులు

విధాత: కరోనా వారియర్, సినీ నటుడు సోనూసూద్ కు మరోసారి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరే షన్ నోటీసులు పంపించింది. ఆరు అంతస్తుల బిల్డింగ్ లో సోనూసూద్ హోటల్ ను నడుపుతున్నా రని.. దానిని బిల్డింగ్ ప్లాన్ ప్రకారం నివాస భవంతిగా మార్చుతానన్న మాటను ఇంకా నిలబెట్టుకోలే దని నోటీసులో గుర్తు చేసింది.ఈమేరకు నవంబర్ 15, 2021న ఈ నోటీసులు పంపింది.వెంటనే స్పందించి యథాస్థితిలో బిల్డింగ్ ను కొనసాగించాలని నోటీసులో సూచించింది BMC.

మహారాష్ట్రకు చెందిన హక్కుల కార్యకర్త గణేశ్ కుస్ములు సోనూసూద్ పై గతంలో బీఎంసీకి కంప్లైంట్‌ చేశారు. రెసిడెన్షియల్ బిల్డింగ్ ను గర్ల్స్ హాస్టల్ గా మార్చారని.. హోటల్ నడుపుతున్నారని.. ఇది ఇల్లీగల్ అని తన ఫిర్యాదులో తెలిపారు. ఈ భవంతిని కూల్చేయాలని కోరారు. దీనిపై 2021 ఆరంభంలోనే బీఎంసీ-సోనూసూద్ మధ్య సంప్రదింపులు జరిగాయి.

హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా ఇష్యూ వెళ్లింది. భవనంలో హోటల్ నడపడం ఇల్లీగల్ అని హైకోర్టు కామెంట్ చేసింది. దీంతో.. సుప్రీంకోర్టులో తన పిటిషన్ ను సోనూసూద్ వెనక్కి తీసుకున్నారు. అధికారులు చెప్పినట్టుగా తొందర్లోనే బిల్డింగ్ ను రీస్టోర్ చేస్తానని కోర్టుకు, బీఎంసీకి తెలుపుతూ లెటర్ కూడా ఇచ్చారు.