Operation Bunyan Ul Marsoos: పాక్ కీలక నిర్ణయం.. భారత్‌పై ఇక పూర్తి స్థాయి యుద్ధం

విధాత, న్యూ ఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్ తో దెబ్బతిన్న పాకిస్తాన్ సైనిక దాడులతో రెచ్చిపోతుంది. సరిహద్దు వెంట కాల్పులతో..భారత్ భూభాగంపై డ్రోన్లు, క్షిపణులతో వరుస దాడులకు పాల్పడుతుంది. అయితే శనివారం తెల్లవారుజామున సమావేశమైన పాకిస్తాన్ ఆర్మీ అధికారులు భారత్ పై పూర్తి స్థాయి మిలటరీ ఆపరేషన్ చేపడుతున్నట్లుగా ప్రకటించారు. పాక్ డైరక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.
పాక్ సైనిక చర్యకు ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూస్ అని పేరు పెట్టినట్లుగా ప్రకటించారు. ఖురాన్ నుంచి తీసుకున్న ఈ వ్యాఖ్యంలో బన్యాస్ మార్సూస్ అనేది అరబిక్ పద బంధం. చేధించలేని ధృడమైన గోడ అని అర్ధం. ఈ పేరుతో పాకిస్తాన్ తనను తాను ఒక శత్రు దుర్భేద్యమైన గోడగా పేర్కొంది. ఇక అంతర్జాతీయ మీడియ లో మాత్రం ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూస్ అంటే.. నిజంగా అల్లాహ్ తన మార్గంలో యుద్ధంలో పోరాడే వారిని ప్రేమిస్తాడు..వారు ధృడమైన నిర్మాణంలా ఉంటారు అనే అర్ధం వస్తుందని కథనాలు వెలువడ్డాయి.