పంచాయతీరాజ్‌ కమిషనర్‌ అత్యుత్సాహం

విధాత‌: తెలంగాణలో ప్రజాప్రతినిధుల భార్య/భర్త, కుటుంబ సభ్యులు అధికారిక సమావేశాల్లో పాల్గొనరాదని వైరల్‌ అవుతున్న సమాచారంపై మన రాష్ట్ర పంచాయతీరాజ్‌గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ స్పందించడం సర్వత్రా విస్మయం కలిగిస్తోంది. ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు అధికారిక సమావేశాల్లో కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలులేదని, అలా చేస్తే క్రిమినల్‌ కేసులు నమోదవుతాయని అన్ని జిల్లాల కలెక్టర్లకు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఆదేశాలిచ్చినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.ఆ ఆదేశాలిచ్చింది తెలంగాణ పంచాయతీరాజ్‌-గ్రామీణాభివృద్ధి శాఖ అని తేలింది. అయితే నిజానిజాలు తెలుసుకోకుండా.. సదరు […]

  • Publish Date - August 23, 2021 / 03:38 AM IST

విధాత‌: తెలంగాణలో ప్రజాప్రతినిధుల భార్య/భర్త, కుటుంబ సభ్యులు అధికారిక సమావేశాల్లో పాల్గొనరాదని వైరల్‌ అవుతున్న సమాచారంపై మన రాష్ట్ర పంచాయతీరాజ్‌గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ స్పందించడం సర్వత్రా విస్మయం కలిగిస్తోంది.

ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు అధికారిక సమావేశాల్లో కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలులేదని, అలా చేస్తే క్రిమినల్‌ కేసులు నమోదవుతాయని అన్ని జిల్లాల కలెక్టర్లకు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఆదేశాలిచ్చినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.ఆ ఆదేశాలిచ్చింది తెలంగాణ పంచాయతీరాజ్‌-గ్రామీణాభివృద్ధి శాఖ అని తేలింది.

అయితే నిజానిజాలు తెలుసుకోకుండా.. సదరు ఆదేశాలను ఖండిస్తూ గిరిజాశంకర్‌ అత్యుత్సాహంతో పత్రికా ప్రకటన విడుదల చేయడం పలు విమర్శలకు దారి తీసింది. ‘ప్రజాప్రతినిధుల భార్య/భర్త, కుటుంబ సభ్యులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీల్లేదని.. అలాచేస్తే క్రిమినల్‌ కేసులు నమోదవుతాయంటూ కలెక్టర్లకు పంచాయతీరాజ్‌-గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీచేసినట్లుగా సందేశాలను సోషల్‌ వీడియా ద్వారా వైరల్‌ చేస్తున్నారు. ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదు’ అని ఆయన ప్రకటన జారీచేశారు. కమిషనర్‌ కార్యాలయం నుంచి ఇలాంటి ఉత్తర్వులు విడుదల కాలేదని అధికారికంగా స్పష్టం చేస్తున్నామన్నారు. దీనర్థం ఏమిటి? అధికారిక కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధుల భార్య/భర్త, కుటుంబసభ్యులు పాల్గొనవచ్చని చెబుతున్నారా.. వారు పాల్గొనవచ్చని సదరు చట్టంలో ఉందా.. వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోబోమని ఎలా ప్రకటన చేస్తారని పలువురు తప్పుబడుతున్నారు. అనవసరమైన అంశంపై స్పందించి అభాసుపాలయ్యారని ఎద్దేవా చేస్తున్నారు.