Pawan Kalyan: చట్టం అందరికీ సమానం.. అల్లు అర్జున్‌కు స్టాఫ్ చెప్పాల్సి ఉండే

  • By: sr    news    Dec 30, 2024 1:45 PM IST
Pawan Kalyan: చట్టం అందరికీ సమానం.. అల్లు అర్జున్‌కు స్టాఫ్ చెప్పాల్సి ఉండే

విధాత‌: ఇటీవ‌ల పుష్ప‌2 ది రూల్ బెన్‌ఫిట్ షో సంద‌ర్భంగా సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌, అనంత‌రం అల్లు అర్జున్ అరెస్ట్ , బెయిల్‌పై విడుద‌ల ఈ నేప‌థ్యంలో జ‌రిగిన వివాదాలనంత‌రం ఎట్ట‌కేల‌కు మెగా ఫ్యామిలీ నుంచి తొలి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా గేమ్‌ చేంజ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం దిల్ రాజు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను క‌లిశారు. అనంత‌రం మీడియాతో పవన్ కళ్యాణ్ చిట్ చాట్ నిర్వ‌హ‌ఙంచి అల్లు అర్జున్ ఘ‌ట‌న‌పై స్పందిస్తూ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. గోటితో పోయే దానిని గొడ్టలి వరకు తెచ్చారంటూ అభిప్రాయ ప‌డ్డారు. ఇంకా ఆయ‌న మాట్లాడుతూ.. రేవంత్ రెడ్టి చాలా గొప్ప నాయకుడు, డైనమిక్ లీడ‌ర్‌.. కింద నుంచి ఎదిగారు. వైసీపీ విధానాల తరహాలో అక్కడ వ్యవహరించ లేదు.. అక్కడ బెన్ ఫిట్ షోలు, టిక్కెట్లు ధర పెంపు అవకాశం ఇచ్చారు.

అంత భారీ బడ్జెట్‌లో సినిమా తీసినప్పుడు ధరలు పెంచక త‌ప్ప‌ని పరిస్థితి. బెనిఫిట్ షోలకు అధిక ధరలు ఉనప్పుడు కలెక్షన్స్ రికార్డు వస్తాయి, సలార్ పుష్ప సినిమాలకు అందుకే రికార్డ్ కలెక్షన్లు వచ్చాయని అన్నారు. అంచనాలు ఎక్కువగా ఉన్న సినిమాలకు ఫాన్స్ ఎక్కువగా వస్తారు, సినిమా థియేటర్లకు హీరోస్ వెళ్లడం వల్ల ఇబ్బందులు వస్తాయి. ప్రజలు సినిమా హీరోల పట్ల‌ ప్రేమ, ఆదరణ చూపుతారు, హీరో వస్తున్నారంటే అభిమానులు ఎగబడతారు. అర్జున్ విషయంలో ముందూ, వెనుక ఏం జరిగిందో నాకు తెలియదు. నేను సినిమా హాలుకు వెళ్లను అంటే… బాగుంటే మెచ్చుకుంటారు, బాగోకుంటే తిడతారు. కళాకారులకు ఒక పొగడ్త, అవార్డు అనేది వెలకట్టలేం.

మేము సినిమా థియేటర్‌కు వెళ్లడం ఎప్పుడో మానేశా. ఇటువంటి ఘటనల్లొ‌ పోలీసులను నేను ఎందుకు తప్పు పట్టనంటే వారు ముందు భద్రత గురించి ఆలోచన చేస్తారు. విజయనగరంలో నన్ను కూడా ముందుకు వద్దనే చెప్పారు. గ‌తంలో చిరంజీవి గారు ముసుగు వేసుకుని ఒక్కరే ధియేటర్‌కి వెళ్లేవారు, నేనూ మొదట్లో మూడు సినిమాలకి వెళ్లి పరిస్థితి అర్థం చేసుకుని ఆగిపోయాను అని అన్నారు. ఇక అల్లు అర్జున్ విష‌యంలో స్టాఫ్ ముందుగానే చెప్పి ఉండాల్సింది.. ఆయన వెళ్లి కూర్చున్నాక.. ఘటన గురించి చెప్పి తీసుకెళ్లాల్సింది, అర్జున్ కి చెప్పి ఉన్నా ఒక్కోసారి ఆ అరుపుల్లో అతనికి వినిపించలేదేమో, అల్లు అర్జున్ తరపున బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు వెళ్లాల్సి ఉంటే బాగుండేది, అప్పుడు రప్చర్ అవకుండా ఉండేది.

ఈ‌ఘటనలో రేవతి చనిపోవడం నన్ను కలచి వేసింది, గోటితో పోయే దానిని గొడ్డలి వరకు తెచ్చారనేది నా అభిప్రాయం. ఇంతమంది మేము అండగా ఉన్నామని ముందే చెప్పి ఉండాల్సింది, హీరో అభివాదం చేయకపోతే… ఆ నటుడిపై ప్రజల్లో వేరే భావన ఉంటుంది. పొగరు, బలుపు అని అందరూ చర్చ పెడతారు. ఈ ఘటనలో నా వల్ల చనిపోయారనే వేదన అర్జున్ లో ఉంటుంది. వెళ్లి ఆ బిడ్ట కోసం మేమున్నాం అనే భరోసా ఇవ్వాలి. నా వల్ల జరిగిందనేది అల్లు అర్జున్‌లో ఉంది. సినిమా అంటే టీం.. అందరూ భాగస్వామ్యం ఉండాలి. ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చారు. ఇది‌ కరెక్ట్ కాదని నా అభిప్రాయం. చట్టం అందరికీ సమానం. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం soft గా వెళ్లి ఉంటే బాగుండేది