Konda Surekha: భేష్.. మంత్రి సురేఖకు సోనియా గాంధీ లేఖ

విధాత ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha)కు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) లేఖ రాశారు. కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించినందుకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా ప్రశంసిస్తూ గత నెల 26వ తేదీన లేఖ రాశారు.
42 సంవత్సరాల తర్వాత మంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ మహా కుంభాభిషేకం నిర్వహించడం హర్షణీయమని సోనియా గాంధీ ఆ లేఖలో పేర్కొన్నారు. కాలేశ్వరంలో కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు గత నెల 13వ తేదీన మంత్రి కొండ సురేఖ సోనియా గాంధీకి లేఖ రాశారు.
దీనిపై స్పందించిన సోనియా (Sonia Gandhi) ప్రతిగా మంత్రి కొండా సురేఖ (Konda Surekha)ను ప్రశంసిస్తూ లేఖ రాయడం గమనార్హం. చారిత్రక కాళేశ్వరం దేవాలయంలో నాలుగు దశాబ్దాల తర్వాత ఈ కుంభాభిషేకం నిర్వహించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.