బలపడుతున్నా నైరుతి రుతుపవనాలు

ఉపగ్రహ చిత్రాల ప్రకారం, కేరళ సముద్ర తీరం మరియు దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయఅరేబియా సముద్ర ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించే అవకాశములు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే […]

  • By: subbareddy |    news |    Published on : Jun 02, 2021 11:14 AM IST
బలపడుతున్నా నైరుతి రుతుపవనాలు

ఉపగ్రహ చిత్రాల ప్రకారం, కేరళ సముద్ర తీరం మరియు దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయఅరేబియా సముద్ర ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించే అవకాశములు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన

ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :

ఈరోజు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర :

         ఈరోజు  దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు  తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో  ఉరుములు, మెరుపులుతో పాటు  తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల  కురిసే అవకాశం ఉంది. 

రాయలసీమ:

        ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు  తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల  కురిసే అవకాశం ఉంది. మరియు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు  తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల  కురిసే అవకాశం ఉంది. మరియు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.