Telangana Floods : వరదల్లో చిక్కుకున్న వెయ్యి మందిని కాపాడాం: తెలంగాణ డీజీపీ

తెలంగాణలో డీజీపీ జితేంద్రు 1000 మందిని వరదల్లోంచి సురక్షితంగా రక్షించారు; SDRF, NDRF, డ్రోన్లు, హెలికాప్టర్లు సహాయం చేశారు.

Telangana Floods : వరదల్లో చిక్కుకున్న వెయ్యి మందిని కాపాడాం: తెలంగాణ డీజీపీ

Telangana Floods | భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరదల్లో చిక్కుకున్న వెయ్యి మందిని రక్షించినట్టు తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. గురువారం నాడు ఆయన పలు మీడియా చానెల్స్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. కామారెడ్డి, నిర్మల్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్నవారిని సురక్షితంగా తమ శాఖ రక్షించిందని ఆయన తెలిపారు. రెవిన్యూ, ఫైర్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సహా ఇతర శాఖల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ప్రజల ప్రాణాలను కాపాడినట్టు ఆయన తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెళ్లని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా వరదల్లో చిక్కుకున్నవారికి ఆహారం సరఫరా చేశామన్నారు. ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగాయని ఆయన అన్నారు. అవసరమైన ప్రాంతాల్లో హెలికాప్టర్లను ఉపయోగించి సహాయక చర్యలు చేపట్టినట్టు ఆయన వివరించారు. మరో రెండు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. అవసరం ఉంటేనే ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావాలని ఆయన సూచించారు. వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.