Ration Cards: రేషన్ కార్డులు.. తెలంగాణ‌ ప్రభుత్వం శుభ‌వార్త‌

  • By: sr    news    Feb 07, 2025 10:51 PM IST
Ration Cards: రేషన్ కార్డులు.. తెలంగాణ‌ ప్రభుత్వం శుభ‌వార్త‌

విధాత‌: ఎన్నాళ్ల నుంచో రేషన్ కార్డు (Ration Cards)ల్లో మార్పుల‌ కోసం ఎదురు చూస్తున్న సామాన్యుల‌కు తెలంగాణ ప్రభుత్వం శుభ‌వార్త చెప్పింది.

ఇప్పటికీ ఉన్న వాటిల్లో పేరు, చిరునామా, తదితరాలను సులభంగా ఆప్డేట్‌ చేసుకునేలా ‘మీ సేవ’ కేంద్రాల్లో ఆన్లైన్ దరఖాస్తులను అందుబాబులోకి తీసుకు వ‌చ్చింది.

కొత్త రేషన్ కార్డుల జారీకి నిర్దిష్టమైన సమయం లేదని, కార్డుల జారీ ప్ర‌క్రియ‌ ఎప్పటికీ కొనసాగుతుందని తెలంగాణ ప్రభుత్వం మ‌రోసారి వెల్లడించింది.