హైదరాబాద్, విధాత: భూ కేటాయిపు వివాదంలో సినీ దర్శకుడు శంకర్‌కు ఊరట లభించింది. భూ కేటాయింపు సరైందేనని సమర్థించిన తెలంగాణ హైకోర్టు. 2019లో ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్‌కు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మోకిల్లా గ్రామంలో ప్రభుత్వం 5 ఎకరాల భూమి కేటాయించింది. దర్శకుడు శంకర్‌కు మోకిల్లా గ్రామంలోని సర్వే నంబర్ 8లో ఎకరం రూ.5 లక్షలు చొప్పున 5 ఎకరాలను శంకర్‌కు కేటాయిస్తూ 2019లో జీవో నంబర్ 75 జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ కరీంనగర్‌కు చెందిన జె.శంకర్ 2020లో హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.
సినిమా, టీవీ స్టుడియో నిర్మాణంతో పలువురికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తామని పేర్కొంది. స్టుడియో నిర్మాణం కోసం శంకర్ వినతిపత్రం అందజేసిన తర్వాతే రాష్ట్ర కేబినెట్ భూ కేటాయింపు నిర్ణయం తీసుకుందని సీజే ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వం నేరుగా కేటాయించిందన్న పిటిషనర్ వాదనను తప్పు బట్టింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 75 సబబేనని తీర్పు వెలువరించింది.
భూ కేటాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు ఉంటాయని.. ఈ క్రమంలోనే సినీ రంగానికి, క్రీడాకారులకు కేటాయిస్తుందని చెప్పింది. గతంలోనూ పలువురు ప్రముఖులకు భూములు కేటాయించిన సందర్భాలు ఉన్నాయని వెల్లడించింది. సుప్రీంకోర్టు కూడా సినీ, క్రీడా, తదితర రంగాల ప్రముఖులకు ఆయా రంగాల అభివృద్ధి కోసం భూమి కేటాయిండాన్ని సమర్థించిందని గుర్తు చేసింది.
దీనిపై విచారణ పూర్తి కావడంతో బుధవారం తీర్పును రిజర్వు చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం శుక్రవారం తుది ఉత్తర్వులు వెలువరించింది. ‘సినీ పరిశ్రమను ప్రోత్సహించే సదుద్దేశంతోనే స్టుడియో నిర్మాణం కోసం శంకర్‌కు ప్రభుత్వం భూమి కేటాయించింది. ఇతర ఏ పనులకు వినియోగించకూడదన్న నిబంధన కూడా విధించింది.
బలహీన వర్గానికి చెందిన శంకర్ 40 ఏళ్లుగా సినీ పరిశ్రమకు సేవలు అందిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయనకు భూమి కేటాయించే నాటికి అక్కడ ఎకరం మార్కెట్ విలువ రూ.20 లక్షలు మాత్రమే ఉంది. స్టుడియో నిర్మాణంతో పలువురు కళాకారులను సినీ రంగానికి అందించిన వారమవుతాం. చట్ట ప్రకారమే అన్ని నిబంధనలను పాటిస్తూ భూ కేటాయింపు జరిగింది’ అన్న అడ్వకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ చేసిన వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. స్టుడియో నిర్మాణానికి భూమి కేటాయించడాన్ని సమర్థించి తుది ఉత్తర్వులు జారీ చేస్తూ పిల్‌ను కొట్టివేసింది.