ఎస్‌వి ప్రసాద్ మృతి పట్ల భారత ప్రధాన న్యాయమూర్తి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్.వి ప్రసాద్ గారి ఆకస్మిక మరణం పట్ల భారత ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రసాద్ తో తన సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ రమణ; నిరాడంబరుడు, నిగర్వి, నిరంతరం ప్రజాహితం కోసం పరితపించిన నిజాయితీపరుడైన అధికారిగా ప్రసాద్ చిరకాలం గుర్తుండి పోతారని అన్నారు. ప్రసాద్ కార్యశైలి, వ్యవహార దక్షత నేటితరం అధికారులకు ఆదర్శం కావాలని, ప్రసాద్ వంటి అధికారులు అండగా ఉంటే ప్రభుత్వ […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్.వి ప్రసాద్ గారి ఆకస్మిక మరణం పట్ల భారత ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రసాద్ తో తన సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ రమణ; నిరాడంబరుడు, నిగర్వి, నిరంతరం ప్రజాహితం కోసం పరితపించిన నిజాయితీపరుడైన అధికారిగా ప్రసాద్ చిరకాలం గుర్తుండి పోతారని అన్నారు.
ప్రసాద్ కార్యశైలి, వ్యవహార దక్షత నేటితరం అధికారులకు ఆదర్శం కావాలని, ప్రసాద్ వంటి అధికారులు అండగా ఉంటే ప్రభుత్వ కార్యాలు నిర్విఘ్నంగా సాగుతాయనడానికి ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారిగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆయన హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన ప్రగతే నిదర్శనమని న్యాయమూర్తి రమణ అన్నారు.
ప్రసాద్ నిర్యాణం వ్యక్తిగతంగా తనకు అపారమైన లోటని అభివర్ణిస్తూ న్యాయమూర్తి రమణ,ప్రసాద్ కుటుంబ సభ్యులకు, వేలాది అభిమానులు, మిత్రులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram