Neeli Meghamula lo: ఈ రోజుల్లో ఇంత మంచి పాట‌నా.. దీని వెనుక‌ ఇంత అర్థం ఉందా!

  • By: sr    news    Apr 01, 2025 2:02 PM IST
Neeli Meghamula lo: ఈ రోజుల్లో ఇంత మంచి పాట‌నా.. దీని వెనుక‌ ఇంత అర్థం ఉందా!

Neeli Meghamula lo | 35 Movie

విధాత‌: ద‌శాబ్దం కింద‌టి వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రికీ వారి వారి మ‌న‌సికోల్లాసం కోసం పాట‌లు వింటూ త‌మ ఒత్తిడిల నుంచి కాస్త ఉప‌శ‌మ‌నం పొందేవారు. త‌ర్వాత మోబైల్స్ వాడ‌కం రెట్టింపు అవ‌డం, ఇంట‌ర్నెట్ ప్ర‌పంచాన్ని శాసించ‌డం మొద‌లు పెట్ట‌డంతో మ‌నుషుల‌కు క్ష‌ణం తీరిక లేకుండా పోయింది. ఈ క్ర‌మంలోనే రోజురోజుకు పాట‌ల‌ను వినే వారి సంఖ్య కూడ‌ క్ర‌మంగా త‌గ్గిపోతూ ఉంది. అదే కోవ‌లో స్పీడ్‌కు అవాటు ప‌డ్డ జ‌నానికి వారికి న‌ప్పే పాట‌లు మాత్ర‌మే సినిమాల‌ల్లో ఉప‌యోగిస్తున్నారు. ఏదైనా ఓ పాట‌, ఓ గొంతు హైలెట్ అయితే వాటి వెంటే ప‌డుతున్నారు. వారు ఎలా ప‌డుతున్నా, అందులో అర్థం లేక‌పోయినా అహా.. ఓహో అంటూ గొంతు దాట‌ని మాట‌ల‌తో తెగ పొగిడేస్తున్నారు. ఈపాటను యూట్యూబ్‌లో విన్న‌వారంతా ఇంత అద్భుత సాహిత్యం ఉన్న పాట ఇటీవ‌ల వ‌చ్చిందా అని అశ్చ‌ర్య పోవ‌డ‌మే గాక‌ ల‌క్ష‌ల్లో కామెంట్లు పెడుతూ త‌మ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

అలాంటి స‌మ‌యంలోనే ఇంద్ర సినిమాలోని నేనున్నానే నాయ‌న‌మ్మ అనే ఫేమ‌స్ డైల‌గ్‌లా వ‌చ్చిందే 35 చిన్న క‌థ క‌దు సినిమాలోని నీలి మేఘములలో ధరణి తేజం అనే పాట‌. నాటి విశ్వ‌నాథ్ సినిమాల్లోని పాట‌లను త‌ల‌పిస్తూ ఇలాంటి పాట ఈరోజుల్లో వ‌చ్చిందా అని మ‌న‌ల్ని ఒకింత షాక్‌కు గురి చేస్తుంది. ఆపై పాట‌ను ఎన్ని సార్లు విన్నా కాస్తైనా బోర్ కొట్ట‌దు క‌దా ఇంకా త‌నివి తీర‌దు అనేలా ఈ పాట సాగుతుంది. ఈ పాట గురించి వ‌ర్ణ‌న అతి అయింద‌నుకుంటే మీరూ విన్నాక మీ అభిప్రాయ‌మేంటో తెల‌పండి. పాట విన్నాక దాని అర్థం తెలుసుకున్నాక ఆ పాట‌ను ర‌చించిన ర‌చ‌యిత భ‌ర‌ద్వాజ్ గాలి, పాడిన ఫృథ్వీ హ‌రీశ్‌, సంగీతం అందించిన వివేక్ సాగ‌ర్ అన్నింటికి మించి ఈ రోజుల్లో ఇలాంటి పాట‌ను వ్రాయించుకున్న ఈ చిత్ర ద‌ర్శ‌కుడు ఈమ‌ని నంద‌కిశోర్‌ను పొగ‌డ‌కుండా ఉండ‌లేం. మ‌రో విష‌య‌మేంటంటే మొద‌ట ఈ పాట విన్న వారంతా గేయం ఆల‌పించింది త‌మిళ సింగ‌ర్ సిద్ శ్రీరామ్ అని పొర‌బ‌డ‌డం ఖాయం.

ఈ పాట‌ సారాంశం ఇదే..

ఈ పాటలో, సీతారాముల కథను సీతాదేవి దృష్టి కోణంలో నుంచి చిత్రీకరించారు. సీతాదేవి తన స్వయంవరానికి ముందు తన మనసులో ఉన్న అనుమానాలు, ఆశలు, మరియు భయాలను వ్యక్తపరుస్తుంది. రాముడు ఎంత శక్తివంతుడైనా, సీతాదేవి అలిగినప్పుడు ఆమె మనసులోని భావాలను అర్థం చేసుకోగలడా అనే సందేహం వ్యక్తమవుతుంది.

 

నీలి మేఘములలో ధరణీ తేజం, నయనాంతరంగములలో వనధీ నాదం

నీలి మేఘాల మధ్య భూమి యొక్క ప్రకాశం, కన్నుల లోతుల్లో సముద్ర ధ్వని.

పోరునే గెలుచు పార్థివీపతి సాటిలేని ఘనుడైనా, నీరజాక్షి అలిగే వేళ నుడివిల్లు ముడి వంచగలడా

పోరులో గెలిచిన రాజు అయిన రాముడు, సీతాదేవి అలిగినప్పుడు ఆమె కనుబొమ్మల వంకరను సరిచేయగలడా?

సడే చాలు శత సైన్యాలు నడిపే ధీరుడైనా, వసుధా వాణి.. మిథిలా వేణి మది వెనుక పలుకు పలుకులెరుగ గలడా

చిన్న సంకేతంతో శత సైన్యాలను నడిపే ధీరుడు అయిన రాముడు, సీతాదేవి మనసులోని మాటలను అర్థం చేసుకోగలడా?

జలధి జలములను లాలించు మేఘమే, వాన చినుకు మార్గమును లిఖించదే, స్వయంవరం అనేది ఓ మాయే, స్వయాన కోరు వీలు లేదాయే

సముద్ర జలాలను ప్రేమతో మోసే మేఘం, వాన చినుకు మార్గాన్ని నిర్ణయించదు. స్వయంవరం అనేది ఒక మాయ మాత్రమే, స్వయంగా కోరుకునే అవకాశం లేదు.

మనస్సులే ముడేయు వేళాయె, శివాస్త్ర ధారణేల కొలాతాయే

మనసులు కలిసే సమయం వచ్చినప్పుడు, శివుని ధనుస్సును ఎత్తడం వంటి పరీక్షలు ఎందుకు?

వరం దాముడే వాడే, పరం ఏలు పసివాడే, స్వరం లాగ మారడే, స్వయం లాలి పాడాడే

వరం ఇచ్చేవాడు, పరమలో చిన్న పిల్లవాడు, తన స్వరం మారదు, తనే లాలీ పాట పాడతాడు.

భాస్కరాభరణ కారుణీగుణ శౌరి శ్రీకరుడు వాడే, అవనీ సూన అనుశోకాన స్థిమితాన తాను ఉండ లేడే

సూర్యుని ఆభరణం ధరించిన, కరుణ గుణంతో ఉన్న శౌరి అయిన రాముడు, సీతాదేవి దుఃఖంలో ఉన్నప్పుడు స్థిమితంగా ఉండలేడు.

శరాఘాతమైన గాని తోనికేవాడు కాడే, సిరి సేవించి సరి లాలించి కుశలములు నిలుప ఘనము నొదిలి కదిలే

బాణం తగిలినా కదలని రాముడు, సీతాదేవిని సేవించి, సరి లాలించి, కుశలములు నిలుపుతూ, తన ఘనతను విడిచి ఆమె వైపు కదులుతాడు.

తేలె మేఘములలో ధరణీ తేజం..నయనాంతరంగములలో వనధీ నాదం.

ఈ పాటలో సీతాదేవి తన మనసులో ఉన్న భావాలను వ్యక్తపరుస్తుంది, రాముడి శక్తి, ధైర్యం, మరియు ప్రేమను ప్రశ్నిస్తుంది.