• Telugu News
  • /News

Rasi Phalalu: జ‌న‌వ‌రి 23, ఈ రోజు రాశిఫ‌లాలు.. వారికి అనవసర వ్యయప్రయాసలు

Reported by: sr | వార్త‌లు | Jan 23, 2025, 9:08 am IST
Read Time: 6 mins
Rasi Phalalu: జ‌న‌వ‌రి 23, ఈ రోజు రాశిఫ‌లాలు.. వారికి అనవసర వ్యయప్రయాసలు

Horoscope | జ్యోతిషం, రాశి ఫ‌లాలు అంటే మ‌న తెలుగు వారికి ఏండ్ల త‌ర‌బ‌డి నుంచి చెర‌గ‌ని నమ్మకం. లేచిన స‌మ‌యం నుంచి నిద్రించే వ‌ర‌కు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం. అందుకే ఆ రోజు మ‌న రాశి ఫ‌లాల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ మ‌న ప‌నులు నిర్వ‌హిస్తూ ఉంటాం. దాని ప్ర‌కార‌మే న‌డుచుకుంటూ ఉంటాం కూడా. అందుకే నిద్ర లేవ‌గానే మొద‌ట చాలామంది వెలికేది వారికి ఆరోజు ఎలా ఉండ‌బోతుంద‌నే. అలాంటి వారంద‌రి కోసం వారి పేర్ల పేర‌ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.

మేషం (Aries) :

ప్రయత్నకార్యాల్లో విజయం. ఆకస్మిక ధనలాభం. కుటుంబంతో కాలక్షేపం. అనుకున్న‌ పని పూర్తి. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు అంకురార్ప‌ణ‌ శ్రీకారం చేస్తారు.

వృషభం (Taurus) :

ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు, ఆభరణాలు కొంటారు. ఇతరులకు సలహాలు, సూచనలిస్తారు. సంఘంలో గౌరవం. ధైర్యంతో పనులు చేస్తారు. శుభవార్తలు వ‌స్తాయి.

మిథునం (Gemini) :

ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం. వృత్తి, ఉద్యోగాల్లో వృద్ధి. ఆత్మీయులను కలవడంలో విఫలం. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన. వృథా ప్రయాణాలు అధికం. స్త్రీల వ‌ళ్ల‌ ధనలాభం.

కర్కాటకం (Cancer) :

ఆకస్మిక ధనలాభం. క్రీడాకారులు, రాజకీయాల్లోని వారికి అద్భుత అవకాశాలు. అన్నింటా విజయావ‌కాశాలు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు. వృత్తి, ఉద్యోగరంగాల్లో వృద్ధి.

సింహం (Leo) :

స్థిరాస్తుల సమస్యలు పరిష్కారం. నూతన గృహకార్యాలపై శ్రద్ధ. ఆకస్మిక ధనలాభంతో ఆనందం. బంధు, మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి.

కన్య (Virgo) :

కుటుంబ పరిస్థితులు సంతృప్తికరం. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో పేరు రావ‌డంతో పాటు, ఆదర్శంగా తీసుకోవడానికి ప్ర‌య‌త్నాలు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు.

తుల (Libra) :

ఆత్మీయుల సహకారం. ఆకస్మిక ధననష్టం. అనారోగ్య బాధల‌తో బలహీనుం. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా ప‌డ‌తాయి.

వృశ్చికం (Scorpio) :

మిక్కిలి ధైర్య సాహసాలతో ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయం. శతృబాధలు తొలగుతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా అవుతాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి.

ధనుస్సు (Sagittarius) :

కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం. అశుభ వార్తలు. ధననష్టం జరుగకుండా జాగ్రత్త వ‌హించాలి. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతనకార్యాలు వాయిదా వేసుకోవాలి.

మకరం (Capricorn) :

కుటుంబ కలహాలు దూరం. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు. వృథా ప్రయాణాల వల్ల అలసట. చెడు పనులకు దూరంగా ఉండాలి. అందరితో స్నేహం కొన‌సాగించాలి. స్వల్పంగా ఆర్థిక ఇబ్బందులు.

కుంభం (Aquarius) :

సంపూర్ణంగా కుటుంబ సౌఖ్యం . ఆకస్మిక ధనలాభం. ఇతరులకు ఉపకారం చేయ‌డంలో బిజీగా ఉంటారు. స్త్రీల వ‌ళ్ల‌ లాభం. పేరు, ప్రతిష్ఠలు లభిచండంతో పాటు రుణబాధలు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది.

మీనం (Pisces) :

తోటివారితో విరోధానికి దూరంగా ఉండాలి. వ్యాపారం వ‌ళ్ల‌ నష్టం వ‌చ్చే అవకాశాలు. వృధా ప్రయాణాలు అధిక‌మ‌వుతాయి. కుటుంబ విషయాల్లో అనాసక్తి. స్త్రీలకు విశ్రాంతి తీసుకోవడం అవసరం.