Tomato Prices | టమాటా మరింత పిరం.. కిలో రూ. 160..
Tomato Prices | టమాటా పేరు వింటేనే భయపడాల్సిన ఏర్పడిన పరిస్థితి నెలకొంది. గత కొద్ది రోజుల నుంచి టమాటా రేటు భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం కిలో టమాటా ధర రూ. 160పైనే పలుకుతోంది. ఆకాశాన్నంటిన టమాటా ధరలను చూసి గృహిణులు షాక్ అవుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలో టమాటా ధర కొండెక్కింది. కిలో టమాటాను రూ. 160కి విక్రయిస్తున్నారు. అయితే రెసైన్ జిల్లాలో అత్యధికంగా టమాటాను పండిస్తారు. అయినప్పటికీ ధరలు అమాంతం పెరిగి పోవడంతో స్థానికులు […]
Tomato Prices | టమాటా పేరు వింటేనే భయపడాల్సిన ఏర్పడిన పరిస్థితి నెలకొంది. గత కొద్ది రోజుల నుంచి టమాటా రేటు భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం కిలో టమాటా ధర రూ. 160పైనే పలుకుతోంది. ఆకాశాన్నంటిన టమాటా ధరలను చూసి గృహిణులు షాక్ అవుతున్నారు.
మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలో టమాటా ధర కొండెక్కింది. కిలో టమాటాను రూ. 160కి విక్రయిస్తున్నారు. అయితే రెసైన్ జిల్లాలో అత్యధికంగా టమాటాను పండిస్తారు. అయినప్పటికీ ధరలు అమాంతం పెరిగి పోవడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఆ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో రూ. 120 నుంచి రూ. 150 మధ్య ధర పలుకుతోంది.
ఈ టమాటా ధరల పెరుగుదలపై స్థానిక మీడియా.. రైసెన్ జిల్లా కలెక్టర్ అరవింద్ దూబేను ప్రశ్నించింది. టమాటకు డిమాండ్ పెరగడం, సరఫరా తగ్గిపోవడంతోనే ధరలు పెరిగాయన్నారు. అయితే టమాటా ధరలు ఒక్క రైసెన్ జిల్లాలోనే పెరగలేదు.. దేశ వ్యాప్తంగా టమాటా ధరలు పెరిగిన విషయాన్ని గుర్తించాలని కలెక్టర్ సూచించారు.
అయితే రైసెన్ జిల్లాలో పండించే టమాటాను దక్షిణ భారతదేశం, నేపాల్‌కు ఎగుమతి చేయడం కారణంగానే.. ఇక్కడ కొరత ఏర్పడి, ధరలు పెరిగాయన్నారు. టమాటా ధరల పెరుగుదలపై రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. దళారుల వల్లే ధరలు పెరిగాయన్నారు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram