విధాత:కరోనా తీవ్రత తగ్గడంతో 82 ప్రత్యేక రైళ్లను పునరుద్ధరించినట్లు దక్షిణ మధ్య రైల్వే GM గజానన్ మాల్యా ప్రకటించారు.ఇందులో 16 ఎక్స్ ప్రెస్, 66 ప్యాసింజర్ రైళ్లు ఉన్నట్లు తెలిపారు..ఈనెల 19 నుంచి కొత్త నెంబర్లతో ప్యాసింజర్ రైళ్లు పట్టాలెక్కనున్నట్లు వెల్లడించారు.ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణానికి స్టేషన్లోనే టికెట్లు ఇస్తారని మాస్కులు,భౌతిక దూరం లాంటి కరోనా రూల్స్ తప్పని సరిగా పాటించాలని
సూచించారు.