viral | డాగ్స్ బాక్సింగ్ చూసి ఎంజాయ్ చేస్తున్న కోళ్లు.. మీరు చూసేయండి

ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటుంటే జనాలు కొందరు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.. మరికొందరు గొడవను ఆపడానికి వీలైన వరకు ప్రయత్నిస్తుంటారు. అలాగే, బాక్సింగ్ లాంటి ఫైటింగ్ పోటీలను చూడడానికి జనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.

  • By: chinna |    news |    Published on : Nov 17, 2025 8:09 PM IST
viral | డాగ్స్ బాక్సింగ్ చూసి ఎంజాయ్ చేస్తున్న కోళ్లు.. మీరు చూసేయండి

ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటుంటే జనాలు కొందరు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.. మరికొందరు గొడవను ఆపడానికి వీలైన వరకు ప్రయత్నిస్తుంటారు. అలాగే, బాక్సింగ్ లాంటి ఫైటింగ్ పోటీలను చూడడానికి జనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇది మామూలుగా మనుషుల్లో కనబడుతుంటుంది. కానీ, ఓ కోళ్ల ఫామ్ లో రెండు కుక్క పిల్లలు ఫైటింగ్ చేస్తున్నాయి. ఎవరి బలం ఎంత అంటూ డిష్యూమ్..డిష్యూమ్ చేసుకుంటున్నాయి. అక్కడే ఉన్న కోళ్లు మాత్రం వాటి ఫైటింగ్ చూస్తూ ఉండిపోయాయి. వావ్ భలే కొట్టుకుంటున్నారు అనేలా అలా ఆ పక్కన ఉన్న కోళ్లు చూస్తూ ఉండిపోయాయి. ఆ రెండు పప్పీల ఫైటింగ్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు.