WGL Journalists | డబుల్ బెడ్రూమ్స్ కేటాయించే వరకు పోరాడుతాం

- పదవుల కోసమో అధికారం కోసమో కాదు
- కూడు గూడు కనీస హక్కుల కోసమే మా ప్రయత్నం
- వరంగల్ తూర్పు జర్నలిస్టులు
WGL Journalists | విధాత, వరంగల్: యూనియన్లు, సంఘాలకు అతీతంగా కూడు, గూడు, జర్నలిస్టుల హక్కుల కోసం తాము చేస్తున్న నిరాహార దీక్షకు బిఆరెస్, బీజేపీ నాయకుల మద్దతుతో పాటు ఎవరు కలిసొచ్చినా స్వాగత్తిస్తామని తూర్పు వర్కింగ్ జర్నలిస్టులు ముక్త కంఠంతో తెలిపారు. సోమవారం ఉదయం వరంగల్ మహా నగర పాలక సంస్థ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి, బైక్ ర్యాలీతో దీక్షా శిబిరానికి చేరుకొని మరణించిన జర్నలిస్టులకు నివాళులు అర్పించి దీక్ష ప్రారంభించారు. నిరాహార దీక్షలో బిఆరెస్, బిజెపితోపాటు, జర్నలిస్టుల యూనియన్ నాయకులు పాల్గొని మాట్లాడారు.
డబుల్ బెడ్రూమ్స్ సాధించే వరకు న్యాయ పోరాటం, నిరసన దీక్షలు చేస్తామని అందులో భాగంగా సోమవారం మంగళవారం బుధవారం మూడు రోజుల దీక్షలు ఉంటాయని తెలిపారు. ఈ న్యాయ పోరాటం పై జర్నలిస్టుల దీక్షల పై కొందరు తప్పుడు ప్రచారం చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. కనీస హక్కుల సాధన పోరాటానికి కావాలని రాజకీయ రంగు అంటిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జర్నలిస్టుల హక్కుల కోసం కలిసోచ్చే పార్టీలకు, యూనియన్లను రాజకీయాలకు అతీతంగా స్వాగతిస్తున్నామని, అసత్య ప్రచారం, బురదజల్లే ఆలోచన మానుకోవాలని సంబంధించిన నాయకులకు దీక్ష శిభిరం నుండి సూచించారు. మా ప్రయత్నం ఫ్లాట్లు, డబుల్ బెడ్రూమ్స్, కనీస హక్కులు సాధన కోసమేనని అందులో ఎక్కడ పదవులు అధికారం లేదని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమాలు వరంగల్ తూర్పు జర్నలిస్టులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.