Viral: ఈ ఏనుగు తెలివి చూడండి! కంచె ఎలా తీసేస్తుందో (వీడియో)

  • By: sr    news    Jun 03, 2025 6:10 PM IST
Viral: ఈ ఏనుగు తెలివి చూడండి! కంచె ఎలా తీసేస్తుందో (వీడియో)

Elephant | viral | video

విధాత: అడవికి రాజు సింహానికి తీసిపోకుండా గజరాజుల ఠీవి..హుందాతనం కూడా ప్రత్యేకమైనది. అదిగాక మనిషిలా ఏనుగులు చాల తెలివితో వ్యవహారిస్తుంటాయి. అడవిలో ఒంటరి ఏనుగులు..గుంపులుగా సంచరించే ఏనుగులు ఆహారం కోసం వేట సాగించే క్రమంలో ఒక్కోసారి క్రూరంగానూ..తెలివిగానూ ప్రవర్తిస్తుంటాయి.

అడవి సమీపంలోని గ్రామాలు, పంటపొలాల్లోకి చొరబడి ఏనుగులు చేసే బీభత్సం ఎంతో నష్టదాయకంగా ఉంటుంది. అందుకే చాలమంది ఏనుగుల నుంచి తమ పంటలు..పండ్ల తోటలు రక్షించుకునేందుకు ఫెన్సింగ్(కంచె) నిర్మించుకుంటారు. అయితే వాటిని కూడా ఏనుగులు ధ్వంసం చేసి పంటలను స్వాహా అనిపించడం చూస్తుంటాం. అందులో ప్రత్యేకత ఏముండదుగాని..ఈ వీడియోలో ఓ ఏనుగు చేసిన పని మాత్రం చాల వైరల్ గా మారింది.

ఓ అడవి ఏనుగు పంట పొలాల్లోకి చొరబడే క్రమంలో అడ్డుగా ఉన్న కంచెను చాల లాఘవంతో.. ఎంతో అవగాహానతో ఉన్న దానిలా తెలివిగా తొలగించిన తీరు చూసి తీరాల్సిందే. ఫెన్సింగ్ తీగ నిర్మాణానికి వేసిన చెక్క పిల్లర్ ను ముందుగా తొండంతో కొద్ది కొద్దిగా వంచేసి..ఆ తర్వాతా కాలితో తోసి..పక్కకు ఒరిగాక కాలితో తన్ని.. తొండంతో పక్కకు పడేసి దాని మీదుగా చేనులోకి వెళ్లిపోయింది. కంచెను తొలగించి..పంట చేనులో దొంగలా చోరబడేందుకు ఏనుగు తన శారీరక బలం కంటే బుద్ధి బలం చూపిన తీరు నెటిజన్ల ప్రశంసలందుకుంటుంది.

ఈ వీడియో చూసిన వారంతా ఏనుగులు ఎంత తెలివైనవో చెప్పడానికి ఇదే నిదర్శనమంటున్నారు. అయితే కొందరు రైతులు ఫెన్సింగ్ వైర్ కు కరెంటు పెడుతుండటంతో ఆ తీగలను తాకిన ఏనుగులు విద్యుద్ఘాతంతో మృత్యువాత పడుతున్నాయి. అలాంటి ఘటనపై అటవీ శాఖ కఠినంగా వ్యవహరిస్తూ..పంట, ఆస్తి నష్టాలు చెల్లిస్తుండటంతో ఇటీవల ఆ తరహా మరణాలు తగ్గుముఖం పట్టాయి.