Saturday, April 1, 2023
More
  HomelatestWeekly Horoscope | 19-03-2023 నుంచి 25-03-2023 వార ఫ‌లాలు

  Weekly Horoscope | 19-03-2023 నుంచి 25-03-2023 వార ఫ‌లాలు

  మేష రాశి : వివాదాలు ప‌రిష్కార‌మ‌వుతాయి. పెద్దల అశీస్సులతో కార్యసిద్ధి కలుగుతుంది. సరియైన దిశలో ఆలోచనలు సాగుతాయి. పరిస్థితులు సరిగ్గా అంచనా వేస్తారు. వివాహ ప్రయత్నాలు సిద్ధిస్తాయి. నూతన వ్యక్తులతో కలయికలు లాభిస్తాయి. ధన ప్రాప్తి కలుగుతుంది. ఆంజనేయ స్వామి వారి ఆరాధన మేలు చేస్తూంది.

  వృష‌భ రాశి : అప‌కీర్తి కలుగవచ్చును. వృత్తి, ఉద్యోగములకు చికాకులు కలుగుతాయి. నిరుత్సాహం ఆవరిస్తుంది. సన్నిహిత వ్యక్తులతో విభేదాలు రావచ్చును. శరీర బాధలు కలుగవచ్చును. ప్రయత్నకార్యములకు అడ్డంకులు ఏర్ప‌డ‌తాయి. దుర్జ‌నుల మూలంగా అశాంతి కలుగుతుంది. చెడు ఆలోచన‌ల‌కు దూరంగా వుండండి. నరసింహస్వామి ఆరాధన చిక్కులను తొలగిస్తుంది.

  మిథున రాశి : స్థిరాస్థి వ్యవహారాలలో తొందర పడకండి. నష్టములు కలుగవచ్చును. బహుముఖ ధనవ్యయము వలన మనశ్శాంతి లోపిస్తుంది. దీర్ఘ‌కాలిక వ్యాధులు బాధిస్తాయి. దుర్వార్తా శ్రవణం కలుగవచ్చును. ఉద్రేకమును అదుపులో ఉంచుకోకపోతే శతృవులు పెరుగుతారు. బంధుమిత్రు విరోధములు క‌లుగవచ్బును. విష్ణు ఆరాధన మ‌న‌శ్శాంతినిస్తుంది.

  కర్కాటక రాశి : బంధుమిత్రుల మూలకంగా సంతోషం కలుగుతుంది. ప్రముఖ వ్యక్తులతో కలయికలు లాభిస్తాయి. కీర్తి ప్రతిష్ఠలు కలుగుతాయి. నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. కొన్ని ప్రతిబంధకాలెదురైనమా ప్రయత్న కార్యాలు సిద్ధిస్తాయి. నిర్మాణాత్మకమైన చర్చలలో పాల్గొంటారు. ధన మూలక ఇబ్బందులు కొంత తగ్గుతాయి. సుబ్రహ్మణ్య ఆరాధన శుభములనిస్తుంది.

  సింహ రాశి : ప‌రోపకారములచే గౌరవమర్యాదలు లభిస్తాయి. పండితులు శాస్త్ర సంబంధమైన చర్చలలో పాల్గొనడం ఉల్లాసాన్నిస్తుంది. శతృక్షయము క‌లుగుతుంది. శుభకార్యములకై ప్ర‌యాణాలు చేయవలసి వస్తుంది. నూతన గృహ నిర్మాణ యత్న‌ములు ఫలిస్తాయి. ప్రయత్న కార్యములన్నీ నిర్విఘ్నంగా పూర్త‌వుతాయి. లక్షదేవి ఆరాధన మరిన్ని శుభ‌ములనిస్తుంది.

  కన్యా రాశి : కోర్టు వ్యవహారాలు సానుకులంగా సాగుతాయి. నూతన సామాజిక భాధ్యతలు నిర్వర్తిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అభివృద్ది వుంటుంది. వైద్యరంగంలోని వారికి గౌరవ మ‌ర్యాదలు లభిస్తాయి. ప్రయత్న కార్యములలో అడ్డంకుల‌ను ఎదుర్కొన్న దిగ్విజ‌యింగా వూర్తి చేస్తారు. క్రీడాకారులను విజయాలు లభిస్తాయిలు. దుర్గాదేవి ఆరాధన శుభ‌ములనిస్తుంది.

  తులారాశి : రుణదాతల ఒత్తిడి అశాంతిని కలిగిస్తుంది. ఆకారణ కలహముల వ‌ల‌న మనశ్శాంతి లోపిస్తుంది. కోపాన్ని ఆదుపులో ఉంచుకోండి. స్థిరాస్థి ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆదరణతో సమస్య‌లు దూరమవుతాయి. ప్ర‌యత్నకార్య‌ములు పూర్తి చేసుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్యారాధన అశాంతిని తొలగిస్తుంది.

  వృశ్చిక రాశి : ప్రభుత్వ అధికారులు సానుకూలతతో ప్ర‌య‌త్న కార్య‌ములు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. పిల్లలపై శ్రద్ధ వహిస్తారు. సామాజిక బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారస్థులకు మంచి ఖ్యాతి లభిస్తుంది. దూరప్రాంతముల నుండి శుభవార్తలు వింటారు. ఆదాయాదానికి సరిపడా ఖర్చులు సిద్ధంగా వుంటాయి. గణపతి ఆరాధన శుభములనిస్తుంది.

  ధనస్సు రాశి : వృతి, ఉద్యోగాలలో ప్రతికూలతలు ఎదుర‌వుతాయి. ఎముకలు, నరాలకు సంబంధించిన శరీర బాధలు క‌లుగవచ్చును. మోసపోయే ప్రమాదములు వున్నవి, జాగ్రత్తగా ఉండండి. కార్యవిఘ్నములు కలుగుతుండడం వలన వృథా సంచారము చేయవలసి వస్తుంది. బంధుమిత్రులతో విరోధములేర్ప‌డ‌వ‌చ్చును. శివారాధన వలన కొంత ఉపశమనం లభిస్తుంది.

  మకర రాశి : సత్ప్రవర్తనను కలిగివుంటారు. స్థిరాస్థి మూలక‌ లాభములుంటాయి. క్రీడాకారులకు శ్ర‌మతో కూడిన విజయాలు లభిస్తాయి. బహుమానములు పొందుతారు. దీర్ఘకాలిక వ్యాధులు కొంత ఉపశమిస్తాయి. ఊహించిన దానికి భిన్నంగా కార్యసిద్ధి కలుగుతుంది. స్వల్ప ధన ప్రాప్తి కలుగవచ్చును లక్ష్మీనారాయణుల ఆరాధన మరింత మేలు కలిగిస్తుంది.

  కుంభ రాశి : శరీర సౌఖ్యము వలన ఉల్లాసంగా ఉంటారు. వృత్తి, ఉద్యోగాలలో మీ స్థానానికి గుర్తింపు లభిస్తుంది. దాన ధర్మాది పుణ్యకర్మలను నిర్వహిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో సంభాషణలు ఆనందాన్నిస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. శుభకార్యాచరణకై ఆలోచనలు సాగుతాయి. ఆంజనేయస్వామి ఆరాధన చిక్కులను తొలగిస్తుంది.

  మీన రాశి : విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి. అధికారుల ములకంగా అశాంతి కలుగవచ్చును. తల్లిదండ్రుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. రుణమూలక అశాంతి కలుగుతుంది. సంతాన మూలకంగా అశాంతి కలుగవచ్చును. కుటుంబ సభ్యులతో అభిప్రాయభేదాలు రాకుండా జాగ్ర‌త్త‌ పడండి. దత్తాత్రేయ స్వామి ఆరాధన అశాంతిని తొలగిస్తుంది.

  – తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి,
  కూకట్‌పల్లి, హైదరాబాద్
  ఫోన్‌ నంబర్‌ : +91 99490 11332.

  spot_img
  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular