Wednesday, March 29, 2023
More
    Homelatest12-03-2023 నుండి 18-03-2023 వ‌ర‌కు వార రాశి ఫ‌లాలు

    12-03-2023 నుండి 18-03-2023 వ‌ర‌కు వార రాశి ఫ‌లాలు

    మేష రాశి : వ్యాపారస్థులు నూతన కార్యారంభ‌ములు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అభివృద్ధి కనిపిస్తుంది. కుటుంబ మూలకంగా సౌక్యం క‌లుగుతుంది. సత్ప్రవర్తన కలిగివుంటారు. ప్రముఖలతో సాన్నిహిత్యం పెరుగుతుంది. సమాజంలో గౌరవమర్యాదలు లభిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. విద్యార్థులు అనవసర భయాలను వదిలివేయాలి. శ్రీరామచంద్ర స్వామి ఆరాధన శుభ‌ములను కలిగిస్తుంది.

    వృషభ రాశి : క‌వులు, కళాకారులకు సత్కారములు లభిస్తాయి. సమస్యలను తొందరగా పరిష్కరించుకుంటారు. వేగవంతమైన ఆలోచనలు చేస్తారు. శుభవార్త శ్రవణము ఆనందాన్నిస్తుంది. శుభాకార్యా చ‌ర‌ణ‌ము సంతోషాన్నిస్తుంది. విద్యార్థులు ఉన్నత విద్యావంతుల‌తో చర్చలలో పాల్గొంటారు. లలితా దేవి ఆరాధన శుభఫలితాలను కలిగిస్తుంది.

    మిథున రాశి : మీ స్థాయికి తగిన గౌరవం లభిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులు నుండి ఉపమనం లభిస్తుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. జీవిత భాగస్వామితో సంభాషణలు ఉల్లాసాన్నిస్తాయి. దాన, ధర్మాది శుభకార్యములను ఆచరిస్తారు. పెద్దలను కలవడం ద్వారా మంచి సందేశాలను వినడం సంతోషన్నిస్తుంది. గణపతి ఆరాధన శుభములను కలిగిస్తుంది.

    కర్కాటక రాశి : బహుముఖ ధనవ్యయము అశాంతి కలిగిస్తుంది. పనివాళ్ళపై కోపాన్ని ప్రదర్శించాల్సి వస్తుంది. అధిక నిద్ర వలన సోమరితనం పెరుగుతుంది. కుటుంబ సభ్యులపై అపవాదులు బాధిస్తాయి. పెద్దలతో విభేదాలు క‌లుగుతాయి. దూర్వార్తా శ్రవణము వలన అశాంతి కలుగుతుంది. మోసగాళ్ళతో జాగ్ర‌త్తగా వుండండి. సుబ్రహ్మణ్య ఆరాధ‌న మ‌న‌శ్శాంతినిస్తుంది.

    సింహ రాశి : తల్లి దండ్రుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. భాగస్వాములతో విభేదాలు రావచ్బును. ప్రయాణాలు అసంతృప్తి కలిగిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు అధికారుల మూలక‌ భయములు కలుగుతాయి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం.. తలనొప్పిగా మారుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు. దుర్గా ఆరాధన చిక్కులను తొలగిస్తుంది.

    కన్యా రాశి : వివాహ ప్రయత్నములకై ప్రయాణాలు సత్ఫ౦తాలనిస్తాయి. సోదరులతో విభేదాలు తొలగిపోతాయి. బంధు మిత్రులు ఆదరణ లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. క్రీడాకారులకు అద్భుత విజయాలు క‌లుగుతాయి. పరోపకారము వలన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. రావలసిన ధనం చేతికందడం సంతోషాన్నిస్తుంది. విద్యార్థులు ఉత్సాహవంతులై విద్యాభ్యాసాన్ని సాగిస్తారు. విష్ణు ఆరాధన మరింత శ్రేయస్సునిస్తుంది.

    తులా రాశి : పెద్దలతో విభేదాలు కలుగకుండా జాగ్రత్త పడండి. వివాహ ప్ర‌యాత్నాలములు చివరి నిమిషం అమలు వరకు ఆందోళన కలిగిస్తాయి. కుటుంబ సభ్యులపై అపవాదులు అశాంతిని కలిగిస్తాయి. అధిక ధన వ్యయములు కలుగుతాయి. అధిక నిద్ర వలన ఇబ్బంది ప‌డ‌తారు. ప్రయత్న కార్యములకు కొన్ని ఆటంకాలు కలుగుతుంటాయి. నృసింహస్వామి ఆరాధన ఇబ్బందులను తొలగిస్తుంది.

    వృశ్చిక రాశి : పెద్దల ఆశీస్సులు బలాన్నిస్తాయి. స్థిరాస్థి ప్రయత్నములు ఫలిస్తాయి. నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. ఋణ‌మూలక‌ అశాంతులు వుంటాయి. శరీర బలహీనతలు బాధిస్తాయి. వాహన మూలక అసౌకర్యం కలుగుతుంది. గతంలో చేసిన పొరపాట్లు బాధిస్తాయి. కొంత అనవసర ధన వ్యయం కలుగుతుంది. కుటుంబ స‌భ్యుల మూలక అశాంతి కలుగవచ్చును. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మనశ్శాంతి కలిగిస్తుంది.

    ధనుస్సు రాశి : పుణ్యక్షేత్ర సందర్శనం ఆనందాన్నిస్తుంది. సత్ప్రవర్తనను కలిగి వూంటారు. ప్రయత్న కార్యములను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వివాహ ప్రయత్నములు ఫలిస్తాయి. క్రీడాకారులు ఆత్మస్థైర్యములో సత్ఫలితాలను పొందుతారు. వాహన దారులు జాగ్రత్తగా వుండాలి. దూర‌ ప్రయాణములు చేయవలసి రావచ్చును. దత్తాత్రేయ స్వామి ఆరాధన శుభములను కలిగిస్తుంది.

    మకర రాశి : క్ర‌య విక్రయముల మూలకంగా లాభం కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఇష్టమైన వ్యక్తుల ఇంటికి వెళ్ళడం ఆనందాన్నిస్తుంది. విద్యార్థులు సత్సంగములలో పాల్గొనడం మేలు కలిగిస్తుంది. పెద్దల సలహాలూ, సూచనలు సత్ఫలితాలనిస్తాయి. పరోపకారములు చేయడం వలన గౌరవ మర్యాదలు లభిస్తాయి. గణపతి ఆరాధన సత్ఫలితాలనిస్తుంది.

    కుంభ రాశి : శరీర బాధలు మ‌నోఃక్లేశాన్ని కలిగిస్తాయి. దూర ప్రయాణముల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబ సుభ్యుల అండదండల వలన ధైర్యం లభిస్తుంది. అంచనాలకు మించిన ధన ప్రాప్తి సంతోషాన్నిస్తుంది. శతృవులతో కలిసి విభేదాలను పరిష్కరించుకుంటారు. అకారణ కలహములు అశాంతిని కలిగిస్తాయి. ఆంజనేయస్వామి ఆరాధన శుభఫలితాల‌ను కలిగిస్తుంది.

    మీన రాశి : ధన వ్యయమును నియంత్రించుకోవాలి. అనవసర ఖర్చులను దూరంగా వుండండి. వృత్తి, ఉద్యోగాలలో అశాంతి కలుగవచ్చును. అధికా ఆలోచనలు ఆరోగ్యాన్ని దూరం చేస్తాయి. సామాజిక కార్యక్రమాలలో అవమానాలు ఎదుతాయి. ఆకస్మిక ప్రమాదాలు భయాన్ని కలిగిస్తాయి. పెద్దల మూలకంగా అశాంతి కలుగవచ్చును. శివారాధన ధైర్యాన్ని కలిగిస్తుంది.

    – తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి,
    కూకట్‌పల్లి, హైదరాబాద్
    ఫోన్‌ నంబర్‌ : +91 99490 11332.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular