Samantha | జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటా.. యంగ్ హీరోపై సమంత పోస్ట్ వైరల్
Samantha | విధాత: ఫలానా హీరో అంటే క్రేజ్ అనీ, ఫలానా తారంటే ఇష్టమని తమ మనసులో మాటను బయటపెట్టారని తెలిస్తే ఆ వార్తలు నెట్టింట వైరల్ అవడం ఖాయం. దాని గురించే చిలవలు పలవలు చేస్తూ చర్చలు జరగడమూ కామనే. అదే క్రేజ్ ఉన్న హీరోయిన్ మాట్లాడిందంటే అది మరీ హాట్ టాపిక్ అయ్యి కూర్చుంటుంది. ఇప్పుడు సమంత ఓ యంగ్ హీరోపై చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడలానే హాట్ టాపిక్‌గా వైరల్ అవుతున్నాయి. నాగ […]

Samantha |
విధాత: ఫలానా హీరో అంటే క్రేజ్ అనీ, ఫలానా తారంటే ఇష్టమని తమ మనసులో మాటను బయటపెట్టారని తెలిస్తే ఆ వార్తలు నెట్టింట వైరల్ అవడం ఖాయం. దాని గురించే చిలవలు పలవలు చేస్తూ చర్చలు జరగడమూ కామనే. అదే క్రేజ్ ఉన్న హీరోయిన్ మాట్లాడిందంటే అది మరీ హాట్ టాపిక్ అయ్యి కూర్చుంటుంది.
ఇప్పుడు సమంత ఓ యంగ్ హీరోపై చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడలానే హాట్ టాపిక్‌గా వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్యతో విడాకుల తర్వాత మరో యువ హీరో విషయంలో జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటానని సమంత చెప్పడం మరింత హాట్ టాపిక్ అవుతోంది. ఆ వివరాలేంటో చూద్దాం..
తాజాగా సమంత సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకుంది. మామూలుగా సమంత ఈమధ్యకాలంలో ఏదైనా బాహాటంగా చెప్పేయడం మొదలుపెట్టాక.. ఆమె ఏం చెప్పినా సోషల్ మీడియాలో సంచలనమై చక్కర్లు కొడుతుంది.
నాగచైతన్యతో విడాకుల తర్వాత ఆమె ఏం చెప్పినా సంచలనమే అవుతున్న సందర్భంలో ఈ మధ్య కాలంలో తనకు కష్టకాలంలో అండగా ఉన్న స్నేహితుల గురించి వరుసగా చెప్పుకొస్తుంది సమంత. ఆమధ్య తన కోస్టార్ విజయ్ దేవరకొండ ఫోటో షేర్ చేస్తూ కష్ట కాలంలో తనకు సపోర్టివ్‌గా నిలిచినందుకు థ్యాంక్స్ చెప్పుకొచ్చింది. తాజాగా తన బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ రవీంద్రన్ ఫోటో షేర్ చేస్తూ అతని గురించి చిలిపిగానే చెప్పింది.
View this post on Instagram
‘‘నీ మంచితనాన్ని మరిచిపోలేనని, ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటానని’’ సమంత చెప్పిన మాటలు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతున్నాయి. ‘‘రాహుల్ నిన్ను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటా, మాకోసం తినాలనే కోరికను కూడా వదులుకుంటావు. కానీ లోపల ఎంత బాధపడతావో’’ అని చమత్కరించింది. దీనికి రాహుల్ కూడా ఫన్నీగానే రిఫ్లయ్ ఇచ్చాడు.
ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత, రాహుల్ భార్య చిన్నయి క్లోజ్ ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. దీంతో రాహుల్ కూడా సమంతకు క్లోజ్ ఫ్రెండ్‌గా మారిపోయాడు. సమంతకు కష్టకాలంలో అండగా నిలబడిన వారిలో రాహుల్ కూడా ఒకడని.. సమంత ఇలా చెప్పకనే చెప్పేసింది.