సోనియా, రాహుల్ గాంధీలతో అజారుద్ధీన్ భేటీ

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ టికెట్ కోసం అజారుద్దీన్‌ సోనియా, రాహుల్ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం.

సోనియా, రాహుల్ గాంధీలతో అజారుద్ధీన్ భేటీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ టికెట్ ఆశావహుల్లో ఒకరైన మహ్మద్ అజారుద్ధీన్ మంగళవారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కలుసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్న అజారుద్ధీన్ ఈ విషయాన్ని సోనియా, రాహుల్ ల దృష్టికి తీసుకెళ్లి పార్టీ టికెట్ కోరినట్లుగా సమాచారం. కాంగ్రెస్ అగ్రనేతలతో అజారుద్ధీన్ భేటీ వ్యవహారం ఆ పార్టీలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ ఆశావహుల్లో ఆసక్తికరంగా మారింది. టికెట్ కోసం అజారుద్ధీన్ చేస్తున్న ప్రయత్నాలను తెలుసుకుని వారు కూడా తమ పరిధిలో టికెట్ కోసం చేస్తున్న ప్రయత్నాల్లో వేగం పెంచినట్లుగా తెలుస్తుంది.

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన అజారుద్దీన్‌, న‌వీన్ యాద‌వ్‌తో పాటు సీఎంకు అత్యంత స‌న్నిహితులైన ఫహీమ్‌ ఖురేషీ, ఖైర‌తాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి పేర్లు టికెట్ రేసులో వినిపిస్తున్నాయి. అజారుద్దీన్ అభ్యర్థి అయితే ఎంఐఎం మద్దతునివ్వకపోవచ్చని తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో గెలిస్తే మైనార్టీ కోటాలో అజారుద్ధీన్ మంత్రి కూడా అయ్యే చాన్స్ ఉంది. ఈ ఉప ఎన్నికల బాధ్యతలను హైద‌రాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాక‌ర్‌తో పాటు మ‌రో ఇద్దరు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, గ‌డ్డం వివేక్‌ల‌కు కాంగ్రెస్ పార్టీ అప్పగించింది.

ఇవి కూడా చదవండి…

నీటి పునరుద్ధరణ ప్రాజెక్టుల కోసం రూ.37 కోట్ల పెట్టుబడి పెట్టిన అమెజాన్

మీకు తెలుసా.. ఆ న‌ది 10 దేశాల గుండా ప్ర‌వహిస్తుంది..!