టీటీడీ చైర్మన్‌ పదవికి భూమన రాజీనామా

విధాత : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి నేపథ్యంలో తిరుపతి టీటీడీ చైర్మన్ పదవికి భూమన కరుణాకర్‌రెడ్డి రాజీనామా చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన తన చైర్మన్‌ పదవికి రాజీనామా సమర్పించారు.

  • By: Subbu |    politics |    Published on : Jun 04, 2024 7:54 PM IST
టీటీడీ చైర్మన్‌ పదవికి భూమన రాజీనామా

విధాత : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి నేపథ్యంలో తిరుపతి టీటీడీ చైర్మన్ పదవికి భూమన కరుణాకర్‌రెడ్డి రాజీనామా చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన తన చైర్మన్‌ పదవికి రాజీనామా సమర్పించారు. తన రాజీనామాను ఆమోదించమంటూ టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి భూమన కరుణాకర రెడ్డి లేఖ అందించారు. టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర రెడ్డి గత ఆగస్టు నెలలో బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమితో ఆయన చైర్మన్‌ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే తరహాలో వైసీపీ ప్రభుత్వంలో వివిధ నామినేటెడ్‌ పదవుల్లో ఉన్న వారంతా వరుసగా రాజీనామాలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.