సీఎం రేవంత్ రెడ్డి హైబ్రిడ్ విధానం మూర్ఖత్వం: ఎంపీ తేజస్వీ సూర్య ఫైర్

డీలిమిటేషన్‌కు జీడీపీ ప్రాతిపదికగా హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదన మూర్ఖత్వమని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య విమర్శించారు. లోక్‌సభలో వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.

విధాత : జీడీపీ ప్రాతిపదికగా డీలిమిటేషన్ పక్రియ నిర్వహించాంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ పై బీజేపీ కర్ణాటక ఎంపీ తేజస్వీ సూర్య తీవ్రంగా మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ సవరణ బిల్లులపై గురువారం లోక్ సభలో కొనసాగిన చర్చలో తేజస్వీ సూర్య మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎవరు సలహా ఇచ్చారో కాని..ఆయన చేసిన హైబ్రిడ్ మోడల్ ప్రతిపానలు చూసి…తెలంగాణ ప్రజలు కూడా నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. డీలిమిటేషన్ సీట్ల పెంపుపై సీఎం రేవంత్ వితండవాదం చేస్తున్నారన్నారు. రాష్ట్రాల ఆదాయం ప్రతిఏటా మారుతుందని, డీలిమిటేషన్ ప్రక్రియకు జీడీపీతో ముడిపెట్టడం మూర్ఖత్వం అని రేవంత్ రెడ్డి ప్రతిపాదనలను కొట్టిపారేశారు. రేవంత్ చెప్పినట్లుగా ఆదాయం ప్రకారం ఓట్లు వేస్తే అంబానికి లక్ష ఓట్లు ఇవ్వాలన్నారు. రాజ్యాంగం ప్రకారం ఒకరికి ఒకే ఓటు ఉంటుందన్నారు. ధనవంతులకు మాత్రమే ఓట్లు, సీట్లు ఇచ్చి.. పేదలకు వాటిని దూరం చేసేదిగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్ ఉందని విమర్శించారు.

బ్రిటిష్ వారి కంటే చెత్తగా ఆంధ్రప్రదేశ్ విభజన

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ చట్ట సవరణ బిల్లుల చర్చ సందర్బంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన హైబ్రిడ్ మోడల్ విధానాలను తప్పుబట్టిన ఎంపీ తేజస్వీ సూర్య ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ విభజన చేసిన తీరును కూడా తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్ విభజనను దేశం నుంచి పాకిస్థాన్ విభజనతో పోల్చారు. రాష్ట్ర విభజనను బ్రిటిష్ వారి కంటే చెత్తగా యూపీఏ ప్రభుత్వం చేసిందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై సభలోని తెలంగాణ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి :

సింగర్‌ మంగ్లీ కేసులో రోజుకో ట్విస్ట్
స్వల్పంగా పెరిగిన బంగారం, స్థిరంగా వెండి!

Latest News