మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర కామెంట్స్

రాష్ట్రంలో ప్రతి రోజు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ నమోదవుతుండగా, పదుల సంఖ్యలో మరణాలు జరుగుతున్నాయి.ఇటువంటి పరిస్థితుల్లో పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోవడం దారుణం. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తూన్నారు.ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం వాళ్ల విద్యార్థులు కరోనాకి బలైపోయే ప్రమాదం ఉంది. 10వ తరగతి, ఇంటర్ పరీక్షల పేరుతో విద్యార్థుల జీవితాలకు విషమ పరీక్ష పెడుతున్నారుదాదాపు 15 లక్షల మంది విద్యార్థులు.పరీక్షలు రాయాల్సి ఉంది.ప్రభుత్వం […]

మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర కామెంట్స్

రాష్ట్రంలో ప్రతి రోజు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ నమోదవుతుండగా, పదుల సంఖ్యలో మరణాలు జరుగుతున్నాయి.ఇటువంటి పరిస్థితుల్లో పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోవడం దారుణం.

తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తూన్నారు.ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం వాళ్ల విద్యార్థులు కరోనాకి బలైపోయే ప్రమాదం ఉంది.

10వ తరగతి, ఇంటర్ పరీక్షల పేరుతో విద్యార్థుల జీవితాలకు విషమ పరీక్ష పెడుతున్నారుదాదాపు 15 లక్షల మంది విద్యార్థులు.పరీక్షలు రాయాల్సి ఉంది.ప్రభుత్వం కనుక పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థుల వెంట వారి కుటుంబ సభ్యులు కూడా బయటకు వస్తారు.

పరీక్షల నిర్వహణ కోసం వేలాదిమంది ఉపాధ్యాయులు కూడా బయటకు రావాల్సి ఉంటుంది.పరీక్షల నిర్వహణ కోసం పారిశుద్ధ్య కార్మికులపై అదనపు భారం పడుతుంది.విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు వారి కుటుంబ సభ్యులు కూడా కరోనా కాటుకి బలైపోయి ప్రమాదం ఉంది.విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడితే ఎవరు బాధ్యత వహిస్తారు

దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో పడవ తరగతి పరీక్షలను రద్దు చేశారు.కార్పోరేట్ స్కూల్స్ యాజమాన్యాల నుంచి అందే ముడుపుల కోసమే ముఖ్యమంత్రి పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారనే అనుమానం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వ్యక్తం అవుతుంది

ఒకపక్క హాస్పిటల్స్ లో బెడ్స్, ఆక్సిజన్ లేక కరోనా రోగులు పిట్టలా రాలిపోతున్నారు.పరీక్షలు నిర్వహించకూడదనే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.పరీక్షలు నిర్వహించాల్సిందే అని ముఖ్యమంత్రి పట్టుబట్టడం సరికాదు.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేష్ పరీక్షలు వద్దని చెబుతున్న ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు.

ఆఖరికి పరీక్షలు రద్దు చేయాలని కె ఏ పాల్ కూడా నిరసన దీక్ష చేపట్టారు.ముఖ్యమంత్రి జగన్ విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలి.