తెలంగాణలో ఓట్లు తొలగింపుకు బీజేపీ కుట్ర: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

తెలంగాణలో అడ్డదారుల ద్వారా ఓట్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. పార్టీ కేడర్ అప్రమత్తంగా ఉండాలన్నారు.

తెలంగాణలో అడ్డా దారులు ద్వారా ఓట్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని, కుటిల యత్నంతో సెక్యులర్ ఓట్లు తొలగించేందుకు పన్నాగం వేస్తుందని పీపీసీ చీఫ్ బి.మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఇందిరా భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఎల్ ఏ (బూత్ లెవెల్ ఏజెంట్) విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ లేదని, బీఎల్ ఏ పై ప్రత్యేక దృష్టి పెట్టామని, కార్యకర్తలకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అందరి ధ్యేయం కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీ ప్రధాని కావడమేనని స్పష్టం చేశారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని విధంగా తెలంగాణలో పథకాల అమలు చేస్తున్నామని, రూ.5 లక్షల పెట్టుబడులు రావడం ఆషామాషీ విషయం కాదు అని, అభివృద్ది , సంక్షేమం ధ్యేయంగా ప్రజాపాలన కొనసాగుతుందన్నారు. తెలంగాణలో అత్యధిక పార్లమెంట్,అసెంబ్లీ స్థానాలు గెలిచే దిశగా పార్టీ కేడర్ సన్నద్దం కావాలన్నారు. పార్టీ కేడర్ కు త్వరలోనే తీపి కబురు అందిస్తామని, కార్పొరేషన్ పదవులు భర్తీ చేస్తామన్నారు. 2023 ఎన్నికల విజయం రిపీట్ కావాలని, ఇందుకు క్షేత్ర స్థాయిలో పార్టీ పటిష్టంగా ఉండాలని చెప్పారు. నిరంతరం పార్టీ కోసం పనిచేయాలని, 80శాతం సమయాన్ని పార్టీకి కేటాయించేలా చూసుకోవాలని తెలిపారు. మీ అందరి కర్తవ్యం పార్టీ నిర్మాణం మాత్రమే అని గుర్తు చేసుకోవాలన్నారు.

ఇవి కూడా చదవండి :

ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరామ్ ప్రమాణస్వీకారం
సైకిల్ ట్రాక్ పై మహిళకు వేధింపులు..హైదరాబాద్ లో ఘటన

Latest News