• Telugu News
  • /Politics

అవమానించినా..ధృడంగా నిలబడ్డావ్‌ ..రాహుల్‌కు సోదరి ప్రియాంక అభినందనలు

లోక్‌సభ ఎన్నికల ఫలితాలలో ఇండియా కూటమి సాధించిన విజయాల పట్ల కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ట్విటర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు.

Reported by: Subbu | రాజకీయాలు | Jun 05, 2024, 5:43 pm IST
Read Time: 2 mins
అవమానించినా..ధృడంగా నిలబడ్డావ్‌ ..రాహుల్‌కు సోదరి ప్రియాంక అభినందనలు

విధాత : లోక్‌సభ ఎన్నికల ఫలితాలలో ఇండియా కూటమి సాధించిన విజయాల పట్ల కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ట్విటర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి మంచి ఫలితాలు సాధించడంలో కీలకంగా వ్యవహారించిన రాహుల్‌గాంధీని అభినందించారు. బీజేపీ వారు నిన్ను ఎంతగానో అవమానించినా, అవహేళన చేసినా.. ఏం చేసినా సరే దృఢంగా నిలబడ్డావని, అవరోధాలు ఎదురైనప్పుడు కూడా వెనక్కి తగ్గలేదని రాహుల్‌ను ప్రియాంక కొనియాడారు

. నీ నమ్మకాన్ని ఎంతగా అవమానించినా విశ్వాసాన్ని కోల్పోలేదని, నీపై ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా సత్యం కోసం నీ పోరాటాన్ని ఆపలేదని, ప్రతి రోజూ నీపై కోపం, ద్వేషం పంచినా దాన్ని నీ దరి చేరనీలేదని, ప్రేమ, దయతో నిజం కోసం పోరాడావని అభినందించారు. ఇది వాళ్లందరికీ ఇప్పుడు అర్థం అవుతుందని, నువ్వు మాలో అందరికంటే ధైర్యవంతుడివని మాకు తెలుసని, నీకు సోదరిగా ఉన్నందుకు గర్వపడుతున్నానంటూ ప్రియాంక రాహుల్‌ను ఉద్ధేశించి ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. రాహుల్‌గాంధీని అభినందిస్తూ ప్రియాంక చేసిన ట్విట్ వైరల్‌గా మారింది.