జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాంగ్రెస్ నాయకులపై చేసిన విమర్శలకు కౌంటర్ గా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గట్టి సవాల్ విసిరారు. బుధవారం హైదరాబాద్ లో బీఆర్ఎస్ శ్రేణుల సమావేశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… ఏపీలో ఆంధ్ర కాంట్రాక్టులు, ఆంధ్రలో తెలంగాణ కాంట్రాక్టర్లు బాగానే పనులు చేసుకుంటున్నారని మధ్యలో తెలంగాణ నాయకులు ప్రాంతీయ వాదంతో జనాన్ని పిచ్చోళ్లు చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారని తెలిపారు.
పవల్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఆంధ్రా వాళ్లకు ఎవరికి ఒక్క కాంట్రాక్టు కూడా ఇవ్వబోమని, కావాలంటే చట్టం తెస్తాను అని అన్నాడని తలసాని గుర్తు చేశారు. నిజంగా కోమటిరెడ్డికి దమ్ముంటే, నీ ముఖ్యమంత్రిని ఒప్పించి ఆ చట్టం తెస్తే నేను నా పదవికి రాజీనామా చేయడానికి రెడీ అని తలసాని సవాల్ విసిరారు. నీకు దమ్ముంటే రా అంటూ సవాల్ చేవారు. ఏ మాట మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం లేదని, ఏ హామీ నెరవేర్చడం లేదని, అంతా ప్రజలను మోసం చేసే మాటలే చెబుతున్నరని తలసాని మండిపడ్డారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తలసాని సవాల్
పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడితే ఆంధ్రా వాళ్లకు ఎవరికి ఒక్క కాంట్రాక్టు కూడా ఇవ్వము కావాలంటే చట్టం తెస్తాను అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నాడు
నీ ముఖ్యమంత్రిని ఒప్పించి ఆ చట్టం తెస్తే నేను రాజీనామా చేయడానికి రెడీ
– మాజీ మంత్రి,… https://t.co/Zbqt2g0t7l pic.twitter.com/IpY4zX4Dja
— Telugu Scribe (@TeluguScribe) June 3, 2026
