Karur Stampede| తొక్కిసలాటలో కుట్ర కోణం : టీవీకే

తమిళనాడు కరూర్ లో టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచార సభ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో కోణం ఉన్నట్లుగా టీవీకే ఆరోపిస్తోంది, ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సోమవారం మద్రాస్‌ హైకోర్టులోని మధురై బెంచ్‌ను ఆశ్రయించనున్నట్లు తెలిపింది.

Karur Stampede| తొక్కిసలాటలో కుట్ర కోణం : టీవీకే

విధాత : తమిళనాడులోని( Tamil Nadu) కరూర్‌లో(Karur) సినీ నటుడు, టీవీకే(TVK) అధ్యక్షుడు విజయ్‌ (Vijay) ప్రచారసభ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో (Stampede)  40 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కుట్ర కోణం(conspiracy)  ఉన్నట్లుగా టీవీకే ఆరోపిస్తోంది. రాళ్లదాడి, పోలీసుల లాఠీ ఛార్జీ కారణంగా గందరగోళ పరిస్థితులు నెలకొని తొక్కిసలాట జరిగినట్లు పేర్కొంది. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సోమవారం మద్రాస్‌ హైకోర్టులోని మధురై బెంచ్‌ను(Madras High Court) ఆశ్రయించనున్నట్లు తెలిపింది. ఘటనపై సీబీఐ విచారణ చేపట్టేలా ఆదేశించాలని పిటిషన్‌లో ఆ పార్టీ కోరనుంది.

విజయ్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత

మరోవైపు తొక్కిసలాటలో 40మంది చనిపోవడానికి విజయ్ కారణమని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు(Student Protests)విజయ్ ఇంటి ముట్టడికి ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. విజయ్ ని అరెస్టు చేయాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే కరూర్ ఘటనపై తమిళనాడులోని రాజకీయ పార్టీలు విజయ్ తీరుపై మండిపడుతున్నాయి. సీఎం స్టాలిన్ ప్రభుత్వం ఘటనపై ఏకసభ్య విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ కూడా దీనిపై గవర్నర్ ద్వారా వివరాలు తీసుకుంది.