తిరుపతి మళ్లీ వైఎస్సార్‌సీపీనే

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక స్థానాన్ని తిరిగి వైఎస్సార్‌సీపీ సొంతంఅన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ ఇదే ఫలితంఅమరావతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికపై ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలయ్యాయి. తన సిట్టింగ్‌ స్థానాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ సొంతం చేసుకుంటుందని అన్ని సర్వేలు తేల్చి చెప్పారు. ఆరా ఎగ్టిట్ పోల్ ఫలితాలు వైఎస్సార్‌సీపీకి - 65.85%, తెలుగుదేశం పార్టీ -23.1%, బీజేపీ- 7.34% ఓట్లు సాధిస్తుందని తెలిపింది. ఆత్మసాక్షి ఎగ్టిట్ పోల్ ఫలితాల ప్రకారం వైఎస్సార్‌సీపీ - 59.25%, […]

తిరుపతి మళ్లీ వైఎస్సార్‌సీపీనే

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక స్థానాన్ని తిరిగి వైఎస్సార్‌సీపీ సొంతం
అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ ఇదే ఫలితం

అమరావతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికపై ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలయ్యాయి. తన సిట్టింగ్‌ స్థానాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ సొంతం చేసుకుంటుందని అన్ని సర్వేలు తేల్చి చెప్పారు. ఆరా ఎగ్టిట్ పోల్ ఫలితాలు వైఎస్సార్‌సీపీకి – 65.85%, తెలుగుదేశం పార్టీ -23.1%, బీజేపీ- 7.34% ఓట్లు సాధిస్తుందని తెలిపింది.

ఆత్మసాక్షి ఎగ్టిట్ పోల్ ఫలితాల ప్రకారం వైఎస్సార్‌సీపీ – 59.25%, టీడీపీ -31.25%, బీజేపీ – 7.5% ఓట్లు సాధిస్తుందని స్పష్టం చేసింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి తిరుపతి ఎంపీగా విజయం సాధించనున్నారని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.