iPad Pro 2024 : అత్యంత శక్తివంతమైన ఐప్యాడ్ ప్రొ వచ్చేసింది..!
యాపిల్ ఐప్యాడ్(Apple iPad). ట్యాబ్లెట్ల రంగంలో తిరుగులేని రారాజు. అసలు ట్యాబ్‌ను ఇలా వాడొచ్చని చూపించిందే యాపిల్. ఐప్యాడ్‌ను రకరకాల సైజులలో, రకరకాల ఫీచర్లతో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ అత్యంత ఆధునికంగా తీసుకురావడం యాపిల్ ప్రత్యేకత. ఈసారి ఆ ప్రత్యేకత మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఐప్యాడ్ ప్రొను విడుదల చేసింది.
క్యుపర్టినో కంపెనీ, యాపిల్ చడీచప్పుడూ లేకుండా సంచలనం సృష్టించింది. తన సరికొత్త ఐప్యాడ్ ప్రొ(iPad Pro 2024), ఐప్యాడ్ ఎయిర్(iPad Air 2024) మాడళ్లను పరిచయం చేసింది. ఈ రెండు ఐప్యాడ్లు 11 అంగుళాలు, 13 అంగుళాల సైజులో లభిస్తాయి. ఈ నెల 15నుండి మార్కెట్లో లభ్యమవుతాయి.
లెట్ లూస్(LET LOOSE) అనే కాన్సెప్ట్‌తో ఈవెంట్ చేసిన యాపిల్, తన కొత్త ఐప్యాడ్లను ప్రపంచానికి చూపించింది. కొత్త ఐప్యాడ్ ప్రొ, 2022 దాని కంటే ఎంతో సన్నగా, చాలా అందంగా ఉంది. ఓఎల్ఈడీ డిస్ప్లే, యాపిల్ ఎం4 చిప్‌లతో ఇది అత్యంత శక్తివంతంగా తయారైంది. ముఖ్యంగా ఎం4 చిప్(M4 chip) పనితనం కంటే, దాని కృత్రిమ మేధ సామర్థ్యం చాలా ఆకర్షణీయంగా ఉంది.
మరీ ముఖ్యంగా ఐప్యాడ్ ప్రొను ఐప్యాడ్ ప్రొ ఎయిర్ అని పిలవొచ్చు. అంత సన్నగా, తేలికగా ఉంది. కొత్త ఓఎల్ఈడీ డిస్ప్లే కూడా మంచి కాంట్రాస్ట్ రేషియోతో స్టన్నింగ్‌గా ఉంది. యాపిల్ ఈ ఐప్యాడ్ గురించి చెప్పినట్లుగా ఇది మునుపెన్నడూ చూడని బెస్ట్ ట్యాబ్లెట్గా ఒప్పుకోవచ్చు.
11 అంగుళాల ఐప్యాడ్ ప్రొ(iPad Pro 11 inches) ధర రూ.99,900 నుండి మొదలవుతుండగా, 13అంగుళాల ప్రొ(iPad Pro 13 inches) ధర రూ.1,29,900 నుండి మొదలవుతోంది. టాప్ ఎండ్ మాడళ్ల ధర 11 ఇంచ్ రూ.2,29,900 కాగా, 13 ఇంచ్ రూ. 2,59,900గా ఉంది. ఈ 13 అంగుళాల మాడల్ దాదాపు మ్యాక్‌బుక్ ప్రొతో సమానంగా, గట్టిగా చెప్పాలంటే ఇంకా ఎక్కువ సామర్థ్యం కలది.

ఈ రెండు ఐప్యాడ్ల లక్షణాలు, ప్రత్యేకతలు చూద్దాం.
ఐప్యాడ్ ప్రొ 11 : డిస్ప్లే – 11ఇంచ్ టాండెమ్ ఒఎల్‌ఈడీ, రంగులు– సిల్వర్, స్పేస్బ్లాక్, చిప్ – ఎం4(9 సిపియు, 11జిపియూ కోర్లు), స్టోరేజి – 256, 512జిబి, 1, 2టిబి , కెమెరా– 12ఎంపీ ముందు,వెనుక, వైర్లెస్– వైఫై6ఈ, 5జి, కొలతలు– 9.83 6.99 0.21 అంగుళాలు, బరువు–0.98 పౌండ్లు(445 గ్రా).
ఐప్యాడ్ ప్రొ 13 : డిస్ప్లే – 13ఇంచ్ టాండెమ్ ఒఎల్‌ఈడీ, రంగులు– సిల్వర్, స్పేస్బ్లాక్, చిప్ – ఎం4(9 సిపియు, 11జిపియూ కోర్లు), స్టోరేజి – 256, 512జిబి, 1, 2టిబి , కెమెరా– 12ఎంపీ ముందు,వెనుక, వైర్లెస్– వైఫై6ఈ, 5జి, కొలతలు– 11.09 8.48 0.2 అంగుళాలు, బరువు–1.28 పౌండ్లు(580 గ్రా).
ఈ ఐప్యాడ్ ప్రొ ప్రత్యేకతల్లో ఎం4 చిప్‌తో పాటు అల్ట్రా రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లే(Ultra Retina XDR Display) ఇవ్వడం చాలా ఆశ్యర్యకరం. ఈ డిస్ప్లే రంగులను అత్యంత నాణ్యతతో చూపడంతో పాటు ఎంతో దేదీప్యమానంగా ఉంటుంది. 10కోర్ సిపియు, 10కోర్ జిపియుతో ఎం4 చిప్ చాలా శక్తవంతంగా పనిచేస్తోంది. ఎంతో పెద్ద గేమ్స్, అప్లికేషన్లు కూడా అలవోకగా రన్ అవుతున్నాయి. దీని ఏఐ సామర్థ్యం తన న్యూరల్ ఇంజన్( న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ NPU) తో అర్థమవుతుంది. ఇది 38 టాప్స్TOPS (ట్రిలియన్ ఆపరేషన్స్ పర్ సెకండ్) వేగంతో పనిచేయగలదు. ఈ వేగంతో పనిచేయగల ల్యాప్టాపే ఇప్పటివరకు లేదు.
ఈ ఐప్యాడ్లతో పాటు యాపిల్ ఐప్యాడ్ మ్యాజిక్ కీబోర్డ్(Apple Magic Keyboard for iPad Pro)ను, యాపిల్ పెన్సిల్ ప్రొ(Apple Pencil Pro)ను కూడా విడుదల చేసింది. ఇవి రెండు కూడా మరింత నాజూగ్గా, మరిన్ని ప్రత్యేకతలతో రూపొందాయి. వీటిని కొత్త ఐప్యాడ్ ప్రొకు జత చేస్తే, మనం ఒక ఎం4 మ్యాక్‌బుక్ ప్రొను తయారుచేసినట్లే.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram