Direct to Mobile |  ఇక నెట్‌ కనెక్షన్‌ లేకుండానే ఫీచర్‌ ఫోన్‌లో లైవ్‌ టీవీ!

ఫీచర్‌ఫోన్లలో కూడా యూట్యూబ్‌ వీడియోలు, ఓటీటీ సిరీస్‌లు చూసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అది కూడా నెట్‌ కనెక్షన్‌ లేకుండా. అవును.. దీనికోసం డైరెక్ట్‌ టు మొబైల్‌ సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు.

Reported by: Jagan Mohan Talluri | సైన్స్​ – టెక్నాలజీ | Nov 28, 2025, 9:26 pm IST
Read Time: 5 mins
Direct to Mobile |  ఇక నెట్‌ కనెక్షన్‌ లేకుండానే ఫీచర్‌ ఫోన్‌లో లైవ్‌ టీవీ!

Direct to Mobile | ఇప్పటి దాకా స్మార్ట్‌ ఫోన్లలోనే టీవీ కార్యక్రమాలు, సినిమాలు, ఓటీటీ అందుబాటులోనే ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఫీచర్‌ఫోన్లలోకి కూడా తీసుకురానున్నారు. అందులోనూ ఆ ఫోన్‌కు నెట్‌కనెక్షన్‌ కూడా అవసరం లేదు. కేవలం ఫోన్‌ సిగ్నల్‌ ఉంటే చాలు. ఈ సదుపాయం కల్పించే డైరెక్ట్ టూ మొబైల్ (డీ2ఎం) బ్రాడ్‌కాస్టింగ్‌ టెక్నాలజీ ఎంతో దూరంలో లేదు. త్వరలోనే ఇది అమల్లోకి రానున్నది. డీ2ఎం ప్రసారాల కోసం ప్రత్యేకంగా ఫీచర్ ఫోన్లను సాంఖ్యా ల్యాబ్స్ చిప్‌సెట్‌ ద్వారా తయారు చేస్తున్నారు. ఈ ఫోన్ల ధరలు రూ.2,500 లోపే ఉండవచ్చని ఒక అంచనా.

పాన్ ఇండియాలో భాగంగా దేశంలో అందరూ లైవ్ టీవీ సిగ్నల్స్, వెబ్ సిరీస్ ప్రసారాలు చూసేందుకు ప్రసార భారతి ఈ టెక్నాలజీని డెవలప్ చేస్తున్న విషయం విదితమే. డీ2ఎం అమల్లోకి వస్తే జియో, ఎయిర్ టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ ఆదాయంపై తీవ్రమైన ప్రభావం చూపించనున్నదని అంచనా వేస్తున్నారు. ఒక రకంగా ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కోనున్నాయని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ టెక్నాలజీని ఢిల్లీతో పాటు బెంగళూరు మహానగరాల్లో ప్రయోగాత్మంగా పరిశీలిస్తున్నారు. ప్రయోగాలు విజయవంతమైతే త్వరలో దేశవ్యాప్తంగా డీ2ఎం ఫీచర్ ఫోన్ల విక్రయాలు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం మొబైల్ ఫోన్లలో నెట్ సౌకర్యం ఉంటేనే టీవీ చానళ్లను, వెబ్ సిరీస్, యూ ట్యూబ్ లను వీక్షించే అవకాశం ఉంది. డీ2ఎం టెక్నాలజీతో తయారైన ఫీచర్ ఫోన్ కు నెట్ సౌకర్యం అవసరమే ఉండదు. అంతే కాకుండా రియల్ టైమ్ ప్రసారాలు, ఆన్ డిమాండ్ కంటెంట్ కూడా చూడవచ్చు. ఇదే కాకుండా విపత్తుల సమాచారం, అత్యవసర పరిస్థితులపై వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది.

గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో సెల్ నెట్ వర్క్ ఉంటే ప్రత్యక్ష ప్రసారాలను అంతరాయం లేకుండా వీక్షించవచ్చు. ఎఫ్ఎం రేడియో మాదిరి ట్రాన్స్ మిషన్ సిగ్నల్స్ ను రిసీవర్ స్వీకరిస్తుంది. ప్రస్తుతం దేశంలో టీవీలకు అమలవుతున్న డైరెక్ట్ టూ హోమ్ (డీటీహెచ్) లాంటిది అని చెప్పవచ్చు. ఐఐటీ కాన్పూర్ 2022 లో డీ2ఎం టెక్నాలజీకి శ్రీకారం చుట్టింది. అయితే ఇప్పుడున్న ఫీచర్ ఫోన్లలో ఇది సాధ్యం కాదని, కొత్త టెక్నాలజీ అవసరం ఉందని గుర్తించింది. దీని కోసం ప్రత్యేక బేస్ బ్యాండ్, యాంటెన్నా, యాంప్లిఫయ్లర్లు, బేస్ బ్యాండు ఫిల్టర్లు, రిసీవర్లు సమకూర్చి రెండు నగరాల్లో ప్రయోగాత్మకంగా అధ్యయనం చేస్తున్నారు.

Read Also |

Credit Score | క్రెడిట్ స్కోర్ లేకున్నా ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చా?
IRCTC Best Package|| టెంపుల్స్ ఆఫ్ తమిళనాడు
Viral Video : ఏం మింగిందో…భారీ పొట్టతో కొండ చిలువ అవస్థలు!