Galaxy Forever | సగం ధరకే ఫోన్‌ను దక్కించుకోవాలని ఉందా? Galaxy S26 Ultra, Galaxy S26+ వంటి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లను 50 శాతం డిస్కౌంట్‌తో పొందవచ్చు. అది కూడా 12 నెలల నో కాస్ట్ ఈఎంఐతో!. దక్షిణ కొరియాకు చెందిన టెక్ దిగ్గజం శాంసంగ్ ఈ బంపరాఫర్‌ను తీసుకొచ్చింది. Galaxy Forever పేరుతో ఈ స్కీమ్‌ను భారత్‌లో ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది.
భారతీయ వినియోగదారులకు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను మరింత అందుబాటులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ స్కీమ్‌ను తీసుకొచ్చినట్లుగా శాంసంగ్ కంపెనీ తెలిపింది. ఈ గెలాక్సీ ఫరెవర్ కార్యక్రమం కింద వినియోగదారులు మొత్తం స్మార్ట్‌ఫోన్ ధరలో 50 శాతాన్ని వడ్డీ లేని ఈఎంఐ ద్వారా చెల్లించి 12 నెలల పాటు ఉపయోగించుకోవచ్చు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై ఆసక్తి ఉన్నప్పటికీ.. ఒకేసారి పెద్ద మొత్తం ఖర్చు చేయలేని వినియోగదారులకు ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది.
ఈ స్కీమ్ ఎలా పనిచేస్తుంది?
గెలాక్సీ ఫరెవర్ ప్రోగ్రామ్‌లో భాగంగా కస్టమర్లు ఫోన్ మొత్తం ధరలో సగాన్ని 12 నెలల నో కాస్ట్ ఈఎంఐ ద్వారా చెల్లిస్తారు. ఏడాది పాటు ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను ఉపయోగించుకుంటారు. 12 నెలల కాలపరిమితి ముగిసిన తర్వాత కస్టమర్లకు మూడు ఆప్షన్లు ఉంటాయి.
* రిటర్న్ : వినియోగదారులు ఏడాది తర్వాత డివైజ్‌ను తిరిగిచ్చి.. ఫోన్ అసలు ధరలో 50 శాతం అస్యూర్డ్ బైబ్యాక్ వాల్యూను పొందవచ్చు.
* రిటైన్: వినియోగదారులు ఏడాది తర్వాత డివైజ్‌ను ఉంచుకోవచ్చు. అప్పుడు మిగతా 50 శాతం అమౌంట్‌ను 12 నెలల నో కాస్ట్ EMI ద్వారా చెల్లించాలి. క్రెడిట్ కార్డు ద్వారా అయితే మరో 12 నెలలు ఈఎంఐ రూపంలో చెల్లించవచ్చు. అదే శాంసంగ్ ఫైనాన్స్+ ద్వారా మొబైల్ తీసుకున్న వారు మాత్రం 13వ నెలలో మొత్తం బ్యాలెన్స్ చెల్లించాల్సి ఉంటుంది.
* అప్‌గ్రేడ్: 12 నెలల తర్వాత తమ వద్ద ఉన్న డివైజ్‌ను తిరిగి ఇచ్చేసి.. కొత్త డివైజ్‌ను తీసుకోవచ్చు. ఆ సమయంలో ఎటువంటి ప్రశ్నలు అడగకుండానే డివైజ్‌ను వెనక్కి తీసుకుంటామని శాంసంగ్ కంపెనీ తెలిపింది.
అదనపు బెనిఫిట్స్!
ఈ గెలాక్సీ ఫరెవర్ ఫ్లాన్‌లో భాగంగా 13 నెలల పాటు Samsung Care+తో పూర్తి రక్షణ కల్పిస్తున్నారు. ఈ ప్రొగ్రామ్ కోసం రూ.13,999 చార్జి చేస్తారు. దీనివల్ల యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్, లిక్విడ్ డ్యామేజ్ ప్రొటెక్షన్, జీరో రిపేర్ కాస్ట్ వంటి సేవలు లభిస్తాయి. ప్రస్తుతం ఈ స్కీమ్ కింద గెలాక్సీ S26 అల్ట్రా, గెలాక్సీ S26ప్లస్ మోడళ్లకు మాత్రమే పరిమితం చేశారు.
Samsung Galaxy S26 Ultra (12GB RAM+256GB Storage)
* ప్రారంభ ధర : రూ.1,39,999
* నెలసరి ఈఎంఐ:రూ.5,833.29
* ప్రోగ్రామ్ ఫీ: రూ.749.92
* నెలసరి చెల్లించాల్సిన మొత్తం: రూ.6583.21
Galaxy S26+ (12GB RAM+256GB Storage)
* ప్రారంభ ధర : రూ.1,19,999
* నెలసరి ఈఎంఐ: రూ.4,999.96
* ప్రోగ్రామ్ ఫీ: రూ.749.92
* నెలసరి చెల్లించాల్సిన మొత్తం: రూ.5,749.88
ఎవరికి లాభం?
ఈ గెలాక్సీ ఫరెవర్ ప్రొగ్రామ్ శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 1500కిపైగా శాంసంగ్ ఎక్స్‌పీరియెన్స్ స్టోర్లలో అందుబాటులో ఉంది. Samsung Finance+ కింద ఆన్‌లైన్, స్టోర్లలో రెండింటిలోనూ తీసుకోవచ్చు. క్రెడిట్ కార్డు ఈఎంఐ ఆప్షన్ కావాలంటే వెబ్‌సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది ఏడాదికి ఒక కొత్త ఫోన్ కొనుగోలు చేసేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసేవారికి, స్టూడెంట్స్‌కు కూడా లాభదాయకంగానే ఉండనుంది.
Read More :
13 వేలకే 7000mAh భారీ బ్యాటరీ మొబైల్.. రియల్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ఫుల్ డీటైల్స్!
వన్‌ప్లస్ యూజర్లకు షాక్.. Nord 6 ధరలో భారీగా పెంపు!
15వేల లోపే బెస్ట్ స్మార్ట్‌ఫోన్.. భారీ బ్యాటరీ, ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ !
