Self-driving Tesla | డ్రైవర్ లేని డెలివరీతో టెస్లా చరిత్ర
ఇకముందు, వ్యాపారాల కోసం, ప్రజారవాణాలో, ఆహార డెలివరీ సేవల్లో, లాజిస్టిక్స్ రంగంలో ఈ విధమైన ఆటోనమస్ వాహనాలు విస్తృతంగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. అయితే భద్రతా ప్రమాణాలు, ప్రభుత్వ అనుమతులు, సామాజిక స్వీకృతి వంటి అంశాలు ఇంకా చర్చకు నిలబడాల్సివుంది. అయినా ఈ ప్రయోగం ఒక మార్గదర్శక ఉదాహరణగా నిలిచి, “వాహనాల్లో డ్రైవర్ అవసరమేనా?” అనే ప్రశ్నకు జవాబుగా మారుతోంది.
Self-driving Tesla | వాహన పరిశ్రమలో సాంకేతిక విప్లవానికి నాంది పలికే ఘట్టాన్ని టెస్లా నెలకొల్పింది. అమెరికాలోని టెక్సాస్ గిగాఫ్యాక్టరీ నుంచి ఒక వినియోగదారుడి ఇంటికి టెస్లా Model Y కార్ పూర్తిగా తనంతట తానే డ్రైవ్ చేసి, తానుగా పార్క్ అయింది. ఈ ప్రయాణంలో ఎటువంటి డ్రైవర్ లేకపోవడమే కాకుండా, రిమోట్ ఆపరేటర్ కూడా లేకపోవడం విశేషం. దీన్ని ప్రపంచంలో మొదటి పూర్తిస్థాయి ఆటోనమస్ డెలివరీగా టెస్లా పేర్కొంది. ఈ అద్భుత ఘటనపై CEO ఎలాన్ మస్క్ సోషల్ మీడియా వేదిక “X”లో స్పందిస్తూ “Kapow!” అనే ఒక్క మాటతో దీని ప్రాముఖ్యతను చెప్పకనే చెప్పారు.
ఈ Model Y కారు దాదాపు 30 నిమిషాల పాటు ప్రయాణించింది. గిగాఫ్యాక్టరీ నుంచి బయలుదేరిన ఈ కారు, హైవేలు, ట్రాఫిక్ లైట్లు, ఇంటర్‌సెక్షన్లు, నగర వీధుల్లాంటి ప్రతి దశలోనూ AI ఆధారిత నిర్ణయాలతో నడిచింది. కారు గమ్యస్థానానికి చేరిన అనంతరం, వినియోగదారుడి అపార్ట్‌మెంట్ వద్ద తానే పార్క్ అయ్యింది. టెస్లా(Tesla) విడుదల చేసిన వీడియోలో ఈ ప్రయాణానికి సంబంధించిన ప్రతీ దృశ్యాన్ని స్పష్టంగా చూపించారు. వెనుక సీటులో అమర్చిన కెమెరా ద్వారా రికార్డ్ చేసిన ఈ ఫుటేజ్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. ఈ ప్రయోగంపై మస్క్(Elon Musk) మాట్లాడుతూ, “కారులో ఎవరూ లేరు. ఎటువంటి రిమోట్ కంట్రోల్ లేదు. ఇది పూర్తిస్థాయి ఆటోనమస్ డ్రైవింగ్. కారు తానే తానుగా ఓనర్ ఇంటికి చేరడం ఇదే మొదటిసారి,” అని అన్నారు. అలాగే, టెస్లా AI బృందం, చిప్ డిజైన్ విభాగానికి అభినందనలు తెలుపుతూ, ఈ ప్రయోగం భవిష్యత్తు వాహన సాంకేతికతకు కొత్త అడుగు అని చెప్పారు.
అంతేకాదు, టెస్లా ఇటీవలే ఆస్టిన్ నగరంలో తన రోబోటాక్సీ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఇందులో కొద్ది మంది ఇన్వెస్టర్లు, టెక్నాలజీ ఇన్‌ఫ్లుయెన్సర్లు Model Y కార్లలో స్వయంచాలకంగా ప్రయాణించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడం ద్వారా టెస్లా లక్ష్యంగా పెట్టుకున్న “లక్షల రోబోటాక్సీలను రోడ్డుపైకి తేవడం” అనే దిశలో మొదటి మైలురాయిగా నిలిచింది. ఈ డెలివరీ ఘటన కేవలం ఒక వినియోగదారుని ఇంటికి కార్ వెళ్లిన ఘట్టంగా కాకుండా, వాహన రంగానికి ఒక సాంకేతిక దిశానిర్దేశక ఘటనగా మారింది. గతంలో ఎవరూ ఊహించని రీతిలో, డ్రైవర్ లేకుండా కార్ తానే ప్రయాణించి డెలివరీ కావడం వల్ల ఆటోమేటెడ్ ట్రాన్స్‌పోర్ట్, డ్రైవర్ లెస్ రవాణా వంటి ఆలోచనలకు ఆధారంగా నిలుస్తోంది.
ఇకముందు, వ్యాపారాల కోసం, ప్రజారవాణాలో, ఆహార డెలివరీ సేవల్లో, లాజిస్టిక్స్ రంగంలో ఈ విధమైన ఆటోనమస్ వాహనాలు విస్తృతంగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. అయితే భద్రతా ప్రమాణాలు, ప్రభుత్వ అనుమతులు, సామాజిక స్వీకృతి వంటి అంశాలు ఇంకా చర్చకు నిలబడాల్సివుంది. అయినా ఈ ప్రయోగం ఒక మార్గదర్శక ఉదాహరణగా నిలిచి, “వాహనాల్లో డ్రైవర్ అవసరమేనా?” అనే ప్రశ్నకు జవాబుగా మారుతోంది. టెస్లా సాధించిన ఈ ఘనత, ఆటోమేటెడ్ వాహనాల భవిష్యత్తును చూపించడమే కాదు – భద్రత, సమర్థత, స్మార్ట్ నగరాల అభివృద్ధిలో ఆటోనమస్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించగలదనే నమ్మకాన్ని ప్రపంచానికి అందిస్తోంది.
Kapow! 💫 https://t.co/vltieZy7nO
— Elon Musk (@elonmusk) June 28, 2025
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram