Yashasvi Jaiswal | వెస్టిండీస్ తో రెండో టెస్టులో జైస్వాల్ భారీ శతకం
వెస్టిండీస్‌తో రెండో టెస్టులో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ భారీ శతకం (173 నాటౌట్) తో చెలరేగాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2 వికెట్లకు 318 పరుగులు చేసింది.

విధాత: వెస్టిండీస్ తో న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ మైదానం వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆటలో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ భారీ శతకం(150)తో చెలరేగిపోయాడు. దీంతో భారత జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2వికెట్ల నష్టానికి 318 పరుగులతో పటిష్ట స్థితికి చేరుకుంది. టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ గిల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ తొలి వికెట్ కు 58పరుగులు జోడించారు. తొలి వికెట్ గా రాహుల్ (38) పెవిలియన్ కు చేరాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 173 నాటౌట్ భారీ శతకంతో భారత్ భారీ స్కోర్ చేసేందుకు బాటలు వేశాడు. కేవలం 145 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేశాడు. రెండో సెషన్లోగానే శతకం చేయడం విశేషం.
మరో రికార్డు సాధించిన జైస్వాల్
టెస్టు కెరీర్లో యశస్వికిది ఏడో శతకం. ఈ క్రమంలో 24 ఏళ్ల వయసులోపే టెస్టుల్లో ఏడు సెంచరీలు చేసిన తొమ్మిదో బ్యాటర్‌గా నిలిచాడు. అతడి కంటే ముందు డాన్ బ్రాడ్‌మన్ (12), సచిన్ (11), గ్యారీఫీల్డ్ సోబర్స్ (9).. జావెద్ మియాందాద్, గ్రేమ్ స్మిత్, అలిస్టర్ కుక్, కేన్ విలియమ్సన్ ఏడేసి సెంచరీలు చేశారు. రెండో రోజు ఆటలో యశస్వి ఇదే జోరు కొనసాగిస్తే డబుల్ సెంచరీ సాధించే అవకాశముంది. సాయిసుదర్శన్ ఈ మ్యాచ్ లో రాణించి 87పరుగులకు వెనుతిరిగాడు. సాయికిది కెరీర్లో రెండో హాఫ్ సెంచరీ. యశస్వి, సాయిలు రెండో వికెట్ కు 193పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఆట ముగిసే సమయానికి కెప్టెన్ గిల్ 20పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. విండీస్ బౌలర్లలో జొమెల్ వారికన్ ఒక్కడే రెండు వికెట్లు సాధించాడు. మిగతా విండిస్ బౌలర్ల నుంచి ఆయనకు మద్దతు కరువవ్వడంతో భారత బ్యాటర్లు స్వేచ్చగా పరుగులు రాబట్టారు. రెండో రోజు శనివారం భారత్ భారీ స్కోర్ సాధించడం ఖాయంగా కనిపిస్తుంది.