41 ఏళ్ళ తరువాత .. టోక్యో ఒలింపిక్స్​లో కాంస్యం సాధించిన భారత హాకీ జట్టు

విధాత:టోక్యో ఒలింపిక్స్​ లో భాగంగా జరిగిన కాంస్య పతక పోరులో టీమ్ఇండియా హాకీ జట్టు అదరగొట్టింది.జర్మనీతో జరిగిన ఈ మ్యాచ్​లో 5-4 గోల్స్ తేడాతో గెలిచి కాంస్యాన్ని ఖాతాలో వేసుకుంది.భారత కాలమానం ప్రకారం.గురువారం ఉదయం టోక్యోలోని ఒయి హాకీ స్టేడియం నార్త్‌ పిచ్‌లో జర్మనీ-భారత్‌ మధ్య కాంస్యం కోసం పోరు జరిగింది.ఆరంభంలో రెండో నిమిషంలోనే ప్రత్యర్థికి గోల్‌ కట్టబెట్టిన భారత్‌.. మొదట్లో తడబడినట్లు కనిపించింది. ఇక రెండో క్వార్టర్‌లో సిమ్రాన్‌జిత్‌ గోల్‌ కొట్టడంతో స్కోర్‌ 1-1తో సమంగా […]

41 ఏళ్ళ తరువాత .. టోక్యో ఒలింపిక్స్​లో కాంస్యం సాధించిన భారత హాకీ జట్టు

విధాత:టోక్యో ఒలింపిక్స్​ లో భాగంగా జరిగిన కాంస్య పతక పోరులో టీమ్ఇండియా హాకీ జట్టు అదరగొట్టింది.జర్మనీతో జరిగిన ఈ మ్యాచ్​లో 5-4 గోల్స్ తేడాతో గెలిచి కాంస్యాన్ని ఖాతాలో వేసుకుంది.భారత కాలమానం ప్రకారం.గురువారం ఉదయం టోక్యోలోని ఒయి హాకీ స్టేడియం నార్త్‌ పిచ్‌లో జర్మనీ-భారత్‌ మధ్య కాంస్యం కోసం పోరు జరిగింది.ఆరంభంలో రెండో నిమిషంలోనే ప్రత్యర్థికి గోల్‌ కట్టబెట్టిన భారత్‌.. మొదట్లో తడబడినట్లు కనిపించింది. ఇక రెండో క్వార్టర్‌లో సిమ్రాన్‌జిత్‌ గోల్‌ కొట్టడంతో స్కోర్‌ 1-1తో సమంగా ముగిసింది. మూడో క్వార్టర్‌లో మాత్రం నువ్వా నేనా అన్నట్లు సాగింది మ్యాచ్‌. జర్మనీ రెండు గోల్స్‌ కొట్టగా.. ఆ వెంటనే భారత్‌ మరో గోల్‌ కొట్టింది. ఆపై పెనాల్టీ కార్నర్‌ను అందిపుచ్చుకుని హాఫ్‌ టైం ముగిసేసరికి 3-3తో సమం చేసింది భారత్‌.