Amelia Kerr Breaks World Record | వన్డే ఫార్మట్ లో న్యూజిలాండ్ ఉమెన్స్ టీమ్ వరల్డ్ రికార్డు!

మహిళల వన్డేల్లో 347 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి న్యూజిలాండ్ జట్టు చరిత్ర సృష్టించింది. అమేలియా కేర్ 179*తో అద్భుత విజయం అందించింది.

Reported by: Tejaswini Nanna | క్రీడలు | Apr 01, 2026, 12:56 pm IST
Read Time: 3 mins
Amelia Kerr Breaks World Record | వన్డే ఫార్మట్ లో న్యూజిలాండ్ ఉమెన్స్ టీమ్ వరల్డ్ రికార్డు!

విధాత : మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో న్యూజిలాండ్ మహిళల జట్టు సరికొత్త వరల్డ్ రికార్డు నెలకొల్పింది. హిళల వన్డేల్లో అత్యధిక లక్ష్య ఛేదన చేసిన జట్టుగా ఘనతకెక్కింది. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో 347 పరుగుల లక్ష్యాన్ని చేధించిన కివీస్‌ జట్టు అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అంతకుముందు అత్యధిక చేధన రికార్డు భారత్‌ పేరిట ఉంది. కివీస్‌ పైనే భారత్‌ 341/5 టార్గెట్‌ను ఛేదించి విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లూ 1-1 సమంగా నిలిచాయి. ఆఖరి వన్డే ఏప్రిల్ 4వ తేదీన జరగనుంది.

అమెలియా కేర్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో చారిత్రాక విజయం

తొలుత దక్షిణాఫ్రికా మహిళల జట్టు 50 ఓవర్లలో 346/6 చేసింది. సఫారీ బ్యాటర్లు అన్నెకే బాచ్(91), కెప్టెన్ లారా ఓల్వర్ట్(69), ట్రయన్(52*) పరుగులు సాధించారు. కివీస్ బౌలర్లలో ఇల్లింగ్ 3, నైట్ 2 వికెట్లతో రాణించారు. అనంతరం 347పరుగుల భారీ లక్ష్యాన్ని 49.4 ఓవర్లలో 350/8 పరుగులు చేసి ఛేదించింది. కివీస్ బ్యాటర్లలో కెప్టెన్ అమేలియా కేర్ ఆద్బుత బ్యాటింగ్ తో 139 బంతుల్లో 23ఫోర్లు, 1 సిక్స్ తో అజేయంగా 179 పరుగులతో జట్టు సంచలన విజయంతో కీలక భూమిక పోషించింది.

ఇసాబెల్లా గేజ్ (68) మినహా మరెవరు కూడా పెద్ద స్కోర్లు నమోదు చేయనప్పటికి కేర్ తన వన్ ఉమెన్ షో ..కెప్టెన్ ఇన్నింగ్స్ తో జట్టుకు చారిత్రాక విజయాన్ని అందించడం విశేషం. సఫారీ బౌలర్లలో అయబొంగ్ కాకా 3వికెట్లు, మసాబట క్లాస్ 2, కైలా రేనిక్ 2వికెట్లతో రాణించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కేర్ ఎంపికయ్యారు.

ఇవి కూడా చదవండి :

MS Dhoni | కోట్ల విలువైన ఫామ్‌హౌస్‌లో ధోని సింపుల్ జీవితం.. కైలాష్‌పతి గురించి ఆసక్తికర విషయాలు!
Anaya Bangar | లింగ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత కొత్త జీవితం.. అమ్మాయిలా మారిన క్రికెట‌ర్ త‌నయుడు